breaking news
Emergency days
-
‘చంద్రబాబు ఎమర్జెన్సీ వ్యతిరేక ప్రవచనాలు’
సాక్షి, తాడేపల్లి: ఎమర్జెన్సీ కాలంలోనే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేశంలో ఎమర్జెన్సీ కారణమైన వ్యక్తులకు ప్రధాన అనుచరుడుగా అప్పట్లో చంద్రబాబు ఉన్నారు.. కానీ ఇప్పుడేమో అసలు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉన్నట్టు ప్రవచనాలు వినిపిస్తున్నారు’’ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు దుయ్యబట్టారు.‘‘కాంగ్రెస్ పార్టీలో సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా పని చేశారు. అప్పట్లోని ఎమర్జెన్సీలాగే ఏపీలో ఇప్పటి పరిస్థితి ఉంది. అప్పట్లో అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ప్రకటించలేదు.. అంతే తేడా. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఒక పిచ్చి మంత్రి మాట్లాడుతున్నాడు. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ కాదా?. పోలీసులు పోలీసు చట్టాన్ని అనుసరిస్తున్నారా?. తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలను తయారు చేస్తున్నారు. ఈ ఏడాది కాలంలో వేలాది తప్పుడు కేసులు, చిత్రహింసలకు పాల్పడుతున్నారు’’ అని అప్పలరాజు మండిపడ్డారు.‘‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టటం ఎమర్జన్సీ కిందకు రాదా?. లోకేష్ చేతిలో అధికారాన్ని పెట్టి, నీఇష్టం వచ్చినట్టు చేయమని సలహా ఇచ్చారు, అందుకే ఇలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. జగన్‌ని భూతం అంటూ ఫిక్కీ సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. అసలు పారిశ్రామిక వేత్తలను భయపెట్టి పారిపోయేలా చేసిందెవరు?. తమ పరిశ్రమకు రక్షణ కల్పించమని హైకోర్టుకు వెళ్లారంటే ఎవరి పాలనలో అరాచకం జరుగుతున్నట్టు?...జిందాల్‌ను రాష్ట్రం నుండి తరిమేసిందెవరు?. ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ మీద ఆదినారాయణ రెడ్డి దాడులు చేయిస్తే ఈ ప్రభుత్వం ఏం చేసింది?. పల్నాడులో భవ్య సిమెంట్స్‌పై టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని దాడి చేయిస్తే ఫ్యాక్టరీకి తాళం వేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బ్రూవరీస్ మీద లంచాల కోసం వేధించలేదా?. మై హోం సిమెంట్స్ గనులపై ఆంక్షలు పెట్టి వేధించిందెవరు?. చికెన్ టాక్స్ వేసి, కేజీకి రూ.10లు వసూలు చేస్తున్నదెవరు?, కృష్ణపట్నం పోర్టు మీద దాడులకు దిగింది టీడీపీ నేతలు కాదా?’’ అంటూ అప్పలరాజు ప్రశ్నలు సంధించారు...ఇలాంటి దాడులు చేస్తూ పారిశ్రామిక వేత్తలను తరిమేస్తున్నది చంద్రబాబు ముఠానే. అలాంటి చంద్రబాబు ఇప్పుడు జగన్‌ని భూతం అంటూ ఎలా మాట్లాడతారు?. యోగాంధ్ర విఫలం కావడంతో జగన్ పల్నాడు పర్యటనపై ఆరోపణలు చేశారు. ఒక మార్ఫింగ్ వీడియోని తెర మీదకు తెచ్చి ఏకంగా జగన్‌పై కేసు నమోదు చేశారు. చివరికి కారులో కూర్చున్నారంటూ మిగతా వారి మీద కూడా కేసు పెట్టటం ఏంటి?. జగన్ స్పీడుగా వెళ్లి జనాన్ని గుద్దించమని డ్రైవర్‌కి చెప్పినట్టు దిక్కుమాలిన రిపోర్టు రాశారు. ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ కారు ఢీకొని వృద్దుడు చనిపోతే డ్రైవర్ మీదనే ఎందుకు కేసు పెట్టారు?. టీడీపీ ఎమ్మెల్యే మీద ఎందుకు కేసు పెట్టలేదు?..2015లో చంద్రబాబు కాన్వాయ్ ఢీకొని ఒక మహిళ చనిపోతే ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదు?. 2016లో విజయవాడలో మళ్లీ చంద్రబాబు కారు ఢీకొని ఒక యువకుడు చనిపోతే చంద్రబాబు మీద ఎందుకు కేసు పెట్టలేదు?. తెలంగాణలో పవన్ కళ్యాణ్ కారు ఢీకొని ఒకరు చనిపోతే ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదు?. చంద్రబాబు ప్రభుత్వంపై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. వారి సొంత సర్వేలో ఈ వ్యతిరేకత తెలియడంతో డైవర్షన్ రాజకీయాలు మొదలు పెట్టారు. మేధావులు సైతం ఈ పాలనను మెచ్చుకోవటం లేదు. పెద్ద పెద్ద నియంతలే రాజ్యాలను కోల్పోయిన సంగతి తెలుసుకుంటే మంచిది’’ అని సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. -
అణచివేతలో.. ఇందిరమ్మకు తీసిపోని లోకేశ్?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి నారా లోకేశ్ మాటల తీరు, చేష్టలు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి. రాష్ట్ర పరిస్థితులు కూడా 1975 నాటి ఎమర్జెన్సీని తలపిస్తున్నాయి. విపక్ష నేతలందరినీ జైల్లో పెట్టి రాజ్యమేలిన ఇందిరాగాంధీ అప్పట్లోనూ ప్రతిపక్షాలను అభివృద్ధి నిరోధకులుగానే అభివర్ణించారు. పోలీసుల అకృత్యాలకు తట్టుకోలేక ఇతర పార్టీల నేతలు కార్యకర్తలు చాలా మంది అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇందిర కుమారుడు సంజయ్ గాంధీ యువజన కాంగ్రెస్ సారథి. ప్రభుత్వాన్ని ఆయనే నడుపుతున్నారా? అనుకునేంత పవర్ ఫుల్. కేంద్ర మంత్రి ఒకరు సంజయ్ గాంధీ చెప్పులు మోశారన్న విమర్శలు వచ్చాయంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది.మీడియాలో అయితే అంతా భజన వార్తలే ఇవ్వాలి. రామ్‌నాథ్ గోయాంకాకు చెందిన ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ వంటి పత్రికలే ప్రభుత్వం తప్పులపై విమర్శలతో వార్తలు ఇచ్చేవి. వాటిని కూడా సమాచార శాఖ అధికారులు సెన్సార్ చేసేవారు. దానికి నిరసనగా వార్తల బదులు ఖాళీగా ఉంచి పత్రికలను ముద్రించేవారు. దాదాపు రెండేళ్లపాటు దేశం అంతటా ఇలాంటి పరిస్థితి ఎదుర్కుంది. ఏపీలోనూ ఇప్పుడు ఆ పరిస్థితి పునరావృతమవుతుందా? అన్న భయం కలుగుతోంది. టీడీపీలో చేరకపోతే వైఎస్సార్సీపీ నేతలపై ఏదో ఒక కేసు పెట్టి వేధిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఏ జైలు చూసినా వైఎస్సార్సీపీ కార్యకర్తలు అధికంగా కనిపిస్తున్నారట.ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతల అరాచకాలను తట్టుకోవడం కష్టంగా ఉంటోంది. చంద్రబాబు ప్రభుత్వం వారిని నియంత్రించడం లేదు. పోలీసులు పట్టించుకోవడం లేదు. మిగతా నేరాల అదుపు చేయడం సంగతి ఎలా ఉన్నా పోలీసులు బృందాలు, బృందాలుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లి వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేసే పనిలో బిజీగా ఉంటున్నారట. ఇదంతా లోకేశ్ రెడ్ బుక్ ప్రభావమే. దానిని ఆయన కూడా నిర్ధారిస్తున్నట్లే మాట్లాడుతున్నారు. ప్రాజెక్టులు అడ్డుకుంటే రెడ్ బుక్ లోకి పేరు ఎక్కించి వేధిస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక మంత్రి అంటుంటే, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేష్టలుడిగి చూస్తుంటే ఏపీలో ప్రజలను రక్షించేదెవరన్న ప్రశ్న వస్తోంది. ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్నా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ల కన్నా లోకేశ్‌కే అధిక ప్రాధాన్యత లభిస్తోంది. టీడీపీ వారంతా లోకేశ్ దృష్టిలో పడితే చాలన్నట్లు వ్యవహరిస్తున్నారు. లోకేశ్ జోక్యం చేసుకోని ప్రభుత్వ శాఖ ఉండడం లేదట. వేర్వేరు శాఖల మంత్రులు కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు లోకేశ్‌నే ప్రధాన అతిధిగా పిలుస్తూన్నారు.తండ్రి ముఖ్యమంత్రి కాకుంటే, ఈయన మంత్రి అయ్యేవారా? ప్రస్తుతం యువరాజు మాదిరి ఇదంతా తమ సామ్రాజ్యం అన్నట్లు వ్యవహరించ గలిగేవారా?. తన ఆదేశాల మేరకే రెడ్ బుక్ పనిచేస్తోందని, తానే దానికి బాధ్యుడనని మరింత ఓపెన్ గా మాట్లాడుతున్నారంటే చంద్రబాబు ఎంత వీక్ అయింది అర్థమవుతోంది. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు పాలన ఇంత అధ్వాన్నంగా లేదు. లోకేశ్ అండ్ కో ఆదేశాల మేరకు రాజకీయంగా వ్యతిరేక పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన అనేక మందిపై తప్పుడు కేసులు పెట్టడం, పోలీసు శాఖ దుర్వినియోగం, ఒక కేసులో బెయిల్ వస్తుందని అనుకుంటే మరికొన్ని కేసులు పెట్టి అరెస్టు చేయడం, రాష్ట్రంలో ఆ మూల నుంచి ఈ మూలకు తిప్పడం వంటివి చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు కూడా పెడుతున్నారు. ఏపీలో ఎవరినైనా ఎక్కువగా వేధించాలని అనుకుంటే వెంటనే ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తితో ఒక కేసు పెట్టిస్తున్నారు.నటుడు పోసాని కృష్ణ మురళి వయసును కూడా పరిగణనలోకి తీసుకోకుండా దాదాపు నెల రోజుల పాటు వందల కిలోమీటర్ల దూరం ప్రతి రోజు తిప్పుతూ వేధించారంటే ఈ ప్రభుత్వానికి, ఈ పోలీసులకు అసలు మానవత్వం ఉందా అన్న ప్రశ్న వస్తుంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఒక ఎస్టీ వ్యక్తితో ఫిర్యాదు చేయించారట. మరో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూడా అదే చట్టం పెట్టి బెయిల్ రాకుండా చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా లోకేశ్ నేరుగా రెడ్ బుక్ అంటూ ప్రజలను భయపెడుతున్నారు. ఆయన వైఎస్సార్సీపీ వారిని ఉద్దేశించి చెప్పినట్లు కనిపించినా, నిజానికి ఆయన బెదిరించింది ప్రజలనే. ఆయా చోట్ల ప్రాజెక్టులు వచ్చినప్పుడు, స్థానిక ప్రజలు రకరకాల సమస్యలు ఎదుర్కొంటారు. భూముల పరిహారం, కాలుష్యం తదితర సమస్యలు వస్తాయి. వాటిపై ప్రజలు తమ అభిప్రాయాలు చెబుతారు. వారికి రాజకీయ పార్టీలు అండగా ఉంటాయి. ఆ సమస్యలలో వాస్తవమైనవి ఉంటే ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కరించాలి. అంతే తప్ప పోలీసులను పెట్టి కొట్టిస్తామని, వేధిస్తామని అన్నట్లుగా రెడ్ బుక్ తో భయపెడతామన్నట్లుగా స్వయానా ఒక మంత్రి మాట్లాడితే ఏమి చేయాలి? అలాంటివి ఎల్లకాలం సాగవన్న సంగతి గుర్తుంచుకోవాలి.ఇక్కడ ఇంకో చిత్రం ఏమిటంటే ప్రస్తుతం లోకేశ్ ప్రకాశం జిల్లాలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు గతంలో జగన్ ప్రభుత్వ కాలంలో మంజూరు అయినదే. రిలయన్స్ కంపెనీ అధినేత ముకేష్ అంబానీ స్వయంగా ఏపీకి వచ్చి జగన్‌తో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్ పారిశ్రామిక విధానాన్ని మెచ్చుకుంటూ ప్రసంగించారు. అయినా అవేవో తామే తెచ్చినట్లు లోకేశ్ బిల్డప్ ఇచ్చుకున్నారు. అలా చేసినంత వరకు ఆక్షేపించనవసరం లేదు. కానీ, ఆ సందర్భంలో కూడా జగన్ టైమ్ లో పరిశ్రమలు వెళ్లిపోయాయని అంటూ అసత్య ప్రచారాలు చేశారు. ఈ విషయంలో తన తండ్రి చంద్రబాబును మించి అబద్దాలు చెప్పాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే అర్థం అవుతుంది. జగన్ టైమ్‌లో కర్నూలు వద్ద వచ్చిన గ్రీన్-కో ఎనర్జీ ప్లాంట్‌ను ఎద్దేవా చేసింది లోకేశ్ కాదా?. దానిని చెడగొట్టడానికి ఎల్లో మీడియా ఈనాడు ఎన్ని వ్యతిరేక కథనాలు రాసిందీ ఒక్కసారి పాత పత్రికలు తిరగేస్తే తెలుస్తుంది. ఈయన చెప్పినదాని ప్రకారం అయితే ఆ రెడ్ బుక్ ను ప్రయోగించవలసింది వారిపైనే కదా!.అదానీ, తదితరులు రెన్యుబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వస్తే అదానికి రాష్ట్రాన్ని రాసిస్తున్నారని మరో టీడీపీ మీడియా ఆంధ్రజ్యోతి ప్రచారం చేసిందే. తుని వద్ద జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన బల్క్ డ్రగ్ పార్కుకు అనుమతి ఇవ్వవద్దని లేఖ రాసింది స్వయంగా టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కాదా?. తాజాగా వచ్చిన ఒక సమాచారం ప్రకారం గురజాల ఎమ్మెల్యే బెదిరింపులతో రెండు సిమెంట్ పరిశ్రమలు మూతపడ్డాయట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. జగన్ దావోస్ వెళ్లి వేల కోట్ల పెట్టుబడులు తీసుకు వస్తే అవేం కంపెనీలు అంటూ మాట్లాడిన లోకేశ్ తాము అధికారంలోకి వచ్చాక ఆర్భాటంగా దావోస్ వెళ్లి ఉత్తచేతులతో తిరిగి వచ్చారే. పైగా పెట్టుబడుల కోసం వెళ్లలేదని, ఏపీ బ్రాండ్ ప్రచారం కోసమని చెప్పుకున్నారే. ఆ తర్వాత ఆరున్నర లక్షల కోట్ల విలువైన పెట్టుబడులతో పరిశ్రమలు పెట్టడానికి ఒప్పందాలు అయ్యాయంటూ, అవేమిటో చెప్పకుండానే ప్రచారం ఆరంభించారే. ఇప్పుడేమో కర్నూలు గ్రీన్ ఎనర్జీ కంపెనీని, కడప ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ తామే తీసుకువచ్చామని చెప్పుకుంటున్నారే. కడపలో ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ ను జగన్ తీసుకువస్తే దానిని అమరావతికి తరలించే యత్నం చేశారా? లేదా?.గతంలో జగన్ పాలనలో అనేక పరిశ్రమలు వస్తే వాటికి అడ్డు పడడానికి తెలుగుదేశం కాని, ఎల్లో మీడియా కాని చేయని ప్రయత్నం లేదు. ప్రభుత్వం ఏ స్కీమ్ చేపట్టినా పచ్చి అబద్దాలు ప్రచారం చేసిందీ వీరే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరికి బ్యాండ్ వాయించే వారు. ఆ రోజుల్లో జగన్ ప్రభుత్వం కేసులు పెట్టి ఉంటే కొన్ని వందల కేసులు నమోదై ఉండేవి. ఉదాహరణకు యువగళం పేరుతో పాదయాత్ర చేస్తూ లోకేశ్ ఎందరిని బెదిరించారో అందరికీ తెలుసు. జిల్లా ఎస్పీలను సైతం పేరుపెట్టి హెచ్చరికలు చేసేవారు. ఇప్పటి మాదిరిగా అడ్డగోలుగా కేసులు పెట్టి ఉంటే లోకేశ్‌పై ఎన్ని కేసులై ఉండేవి. ఇప్పటం వద్ద అనుమతి లేకుండా కారు పైన కూర్చుని పవన్ కళ్యాణ్ హడావుడి చేశారు. మరోసారి రోడ్డుపై అడ్డంగా పడుకుని పోలీసుల విధులకు ఆటంకం కల్పించిన పవన్‌పై ఆ రోజుల్లో కేసులు పెట్టారా? లేదే!.మహిళలు మిస్ అయ్యారని తప్పుడు ఆరోపణ చేసిన పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టి ఉండవచ్చు కదా?. అయినా అలా చేయలేదే. చంద్రబాబు, లోకేశ్‌లు అప్పటి సీఎం జగన్‌ను సైకో అంటూ, పలు అభ్యంతరకర పదాలు వాడారా? లేదా?. అయినా వారి మీద కేసులు రాలేదు. కానీ ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి పోలీసులు వైఎస్సార్సీపీ వారిపై, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపైన కేసులు పెట్టి హింసిస్తున్నారే!. ఏ రాజ్యాంగం వీటికి అనుమతి ఇస్తుంది?. ఈ విషయంలో ఏపీ హైకోర్టు సైతం పలుమార్లు పోలీసులను హెచ్చరించినా వీరి ధోరణి మారడం లేదు. సూపర్ సిక్స్ హామీల గురించి అడుగుతూ ఒక జూనియర్ లెక్చరర్ ప్రశ్నిస్తే ఆయన వద్ద నాటు సారా దొరికిందని కేసు పెట్టారట. ఇలా ఒకటి కాదు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారో చూశాం.ఇవన్నీ రెడ్ బుక్ లో భాగమేనని లోకేశ్ గర్వంగా ఫీల్ అవుతుండవచ్చు. కానీ షాడో సీఎం స్థాయి నుంచి అసలు సీఎం అవ్వాలని ఆశపడుతున్న లోకేశ్ నిజంగానే ఆ పదవిలోకి వస్తే రాష్ట్రం ఇంకెంత ఘోరంగా తయారవుతుందో అన్న భయం ప్రజలలో ఏర్పడదా?. నిత్యం అబద్దాలు చెప్పడం కాకుండా, కాస్త నిజాయితీగా మాట్లాడుతూ, హుందాగా వ్యవహరిస్తూ, రెడ్ బుక్ పిచ్చిగోలను వదలి వేయకపోతే రాజకీయంగా లోకేశ్‌కే నష్టం కలుగుతుంది. కక్ష పూరిత రాజకీయాలతోనే అధికారంలో కొనసాగాలనుకుంటే అది ఎల్లకాలం అయ్యే పని కాదని ఎమర్జెన్సీ అనుభవం తెలియచేస్తుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘ఎమర్జెన్సీ కాదు.. అంతకు మించిన పరిస్థితి’
లక్నో : నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలన ఎమర్జెన్సీ రోజులకంటే మరింత దిగజారిపోయిందని మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా అన్నారు. గురువారం సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయంలో జరిగిన లోక్ నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ జయంతి ఆయన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యశ్వంత్ మాట్లాడుతూ..‘ప్రస్తుతం దేశం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు వచ్చింది. ఇప్పుడు మనమంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఇప్పటికి మనం మెల్కొనకపోతే దేశంలో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. ప్రజాస్వామ్య రక్షణ కోసం అంతా కలిసి కృషి చేయాలి’అని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రతిపక్షాల కూటమి ఎలాగైతే గెలిచిందో అలాగే 2019ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాల కూటమి పక్కాగా గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. పేరుకే మంత్రులు కానీ.. కేంద్ర కేబినేట్‌లోని అన్ని శాఖలను నరేంద్రమోదీ ఒక్కరే నిర్వహిస్తున్నారని యశ్వంత్ ఆరోపించారు. పేరుకే వివిధ శాఖలకు మంత్రులను నియమించారు, కానీ అధికారాలు మాత్రం వారికి ఇవ్వలేదని విమర్శించారు.‘ రాఫెల్ ఒప్పందం జరుగుతుంది కానీ రక్షణ మంత్రికి లెలియదు. నోట్ల రద్దు జరిగుతుంది కానీ ఆర్థిక మంత్రికి కేబినేట్ మీటింగ్‌కి వచ్చేదాకా తెలియదు. జమ్మూ కశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధిస్తారు కానీ ఆ విషయం హోం మంత్రికి తెలియదు, ఇది ప్రస్తుత కేంద్ర మంత్రుల పరిస్థితి’ అని యశ్వంత్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఇక విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గురించి మాట్లాడుతూ.. ఆమె ప్రధాని నరేంద్ర మోదీ విదేశి పర్యటనకు సంబంధించిన సదుపాయాలను మాత్రమే ఏర్పాటు చేస్తుందన్నారు. ఆమెను ప్రజలు ట్విటర్ మంత్రి, వీసా మంత్రి అని మాత్రమే గుర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపిని ఓడించి ప్రజాస్వామ్యాని రక్షించాలని కోరారు. -
కుటుంబాన్ని రక్షించుకోవడానికే కాంగ్రెస్ ఆరాటం
-
ఇందిర దేశాన్ని జైలుగా మార్చారు
ఎమర్జెన్సీ రోజులపై ప్రధాని మోదీ వ్యాఖ్య న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కాలంనాటి ఎమర్జెన్సీ రోజులు దేశం ఎదుర్కొన్న అత్యంత చీకటి రోజులని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆమె అధికార దాహంతో దేశాన్ని గొలుసులతో బంధించి జైలుగా మార్చేశారని విమర్శించారు. స్మార్ట్ సిటీల మిషన్, అటల్ పట్టణ పునరుద్ధరణ పథకాల ఆవిష్కరణ కోసం ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్‌పై, ఆ పార్టీ నేతలపై మోదీ నిప్పులు చెరిగారు. ‘‘1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు దేశం ఎదుర్కొన్న అత్యంత చీకటి రోజులు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజకీయ నాయకత్వం అణగదొక్కింది. పౌర హక్కులను రద్దుచేశారు. ఇందిరాగాంధీని వ్యతిరేకించిన వారందరినీ జైళ్లలో పెట్టారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మనం వీలైనంతగా కృషి చేద్దాం..’’ అని మోదీ పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యల్ని తిప్పికొట్టిన కాంగ్రెస్ ఎమర్జెన్సీపై నరేంద్ర మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. బీజేపీ నాయకులు అద్వానీ, యశ్వంత్ సిన్హా, వరుణ్ గాంధీ వ్యాఖ్యల్ని పరిశీలిస్తే అధికారం మొత్తం తన గుప్పెట్లో పెట్టుకున్న నాయకుడు మోదీ అని స్పష్టమౌతోందని ఆపార్టీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ అన్నారు. అధికార వ్యామోహంతోనే ఎమర్జెన్సీ విధించారన్న మోదీ వ్యాఖ్యల్ని మాకెన్ కొట్టి పారేశారు. ఎమర్జెన్సీ విషయంలో అద్వానీ వ్యాఖ్యలు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినవేనని అన్నారు. అధికార కేంద్రీకరణ అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. -
మూర్ఖంగా వ్యవహరిస్తున్న మోడీ సర్కారు
కోల్‌కతా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. మోడీ సర్కారు మూర్ఖంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మహిళనని కూడా చూడకుండా తనపై బాధ్యతారాహిత్య, అసభ్య పదజాలంతో దాడి చేస్తోందని వాపోయారు. బీజేపీ అనుసరిస్తున్న అహంకారధోరణి, బాధ్యతారహిత ప్రవర్తన ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే చూస్తూ ఊరుకోమని మమతా బెనర్జీ అన్నారు. తన రాజకీయ జీవితం పోరాటాలు, త్యాగాలతో కూడుకుందన్నారు.