బిహార్ మంత్రి అబ్దుల్ జలీల్.. ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఆ రాష్ట్ర అసెంబ్లీలో దుమారం రేపాయి.
పట్నా: బిహార్ మంత్రి అబ్దుల్ జలీల్.. ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఆ రాష్ట్ర అసెంబ్లీలో దుమారం రేపాయి. ప్రధాని మోదీ దోపిడీ దొంగంటూ జలీల్ విమర్శించారు. మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన తెలియజేశారు.
బుధవారం బిహార్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టిముట్టి జలీల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. చివరకు మంత్రి జలీల్ క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. జలీల్ చేసిన వ్యాఖ్యలపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. జలీల్‌ను కేబినెట్ నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది.