లూప్ రేసులో భారతీ ఎయిర్‌టెల్ | Bharti Airtel likely to buy Loop Mobile | Sakshi
Sakshi News home page

లూప్ రేసులో భారతీ ఎయిర్‌టెల్

Jan 17 2014 1:59 AM | Updated on Sep 2 2017 2:40 AM

మొబైల్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ముంబైలోని లూప్ మొబైల్‌ను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోంది.

న్యూఢిల్లీ: మొబైల్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ముంబైలోని లూప్ మొబైల్‌ను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోంది. తద్వారా 30 లక్షల కస్టమర్లను పొందేందుకు ఎయిర్‌టెక్‌కు వీలు చిక్కనుంది. ముంబై సర్కిల్‌లో మొబైల్ టెలిఫోనీ లెసైన్స్‌ను కలిగిన లూప్.. ఈ డీల్ ద్వారా రూ. 750 కోట్లను ఆశిస్తోంది. అయితే ఖైతాన్ గ్రూప్‌నకు చెందిన లూప్‌నకు రూ. 400 కోట్లమేర రుణాలు కూడా ఉన్నాయి. మొబైల్ బిజినెస్‌ను విక్రయించేందుకు ఇతర టెలికం కంపెనీలతోనూ లూప్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. లూప్‌నకు గల స్పెక్ట్రమ్ విలువ తాజా బేస్ ధరతో పోలిస్తే రూ. 2,624 కోట్లు చేస్తుందని అంచనా. సెప్టెంబర్ చివరికి ముంబైలో ఎయిర్‌టెల్‌కు 41 లక్షల కస్టమర్లున్నారు. 68 లక్షల మంది కస్టమర్లతో వొడాఫోన్ టాప్‌లో ఉంది. లూప్ కొనుగోలుతో ఎయిర్‌టెల్ నంబర్‌వన్‌గా ఎదిగే అవకాశముంది. కాగా, గురువారం బీఎస్‌ఈలో భారతీ షేరు దాదాపు 5% దిగజారి రూ. 316 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement