తేనెటీగల దాడిలో దాదాపు 200 మంది మహిళలు, పిల్లలు గాయపడిన ఘటన బిహార్ లోని ఆర్వాల్ జిల్లాలో చోటు చేసుకుంది.
	పాట్నా: తేనెటీగల దాడిలో దాదాపు 200 మంది మహిళలు, పిల్లలు గాయపడిన ఘటన బిహార్ లోని ఆర్వాల్ జిల్లాలో చోటు చేసుకుంది. వీరందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానిక పండుగను పురస్కరించుకుని మర్రి చెట్టు పూజలు చేస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయని పోలీసు అధికారులు తెలిపారు.
	
	చెట్టుకింద ఒకేసారి ఎక్కుమంది గుమిగూడడంతో తేనెటీగలు దాడిచేశాయని వెల్లడించారు. బాధితులు ఆస్పత్రిలో కోలుకుంటున్నారని చెప్పారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
