తెలంగాణ సాంస్కృతిక వైభవం బతుకమ్మ పండగ దేశవిదేశాల్లోనూ ఖ్యాతిని ఆర్జిస్తోంది.
సిరిసిల్ల: తెలంగాణ సాంస్కృతిక వైభవం బతుకమ్మ పండగ దేశవిదేశాల్లోనూ ఖ్యాతిని ఆర్జిస్తోంది. అమెరికాలోని న్యూజెర్సీలో బుధవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. అమెరికాలోని ప్రవాస తెలంగాణ మహిళలు బతుకమ్మ పండుగను కన్నులపండువగా నిర్వహించారు. తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం(టీడీఎఫ్) ఆధ్వర్యంలో ఈ సంబురాలు జరిగాయి.
మహిళలు పూలతో అత్యంత భక్తిశ్రద్ధలతో పేర్చిన బతుకమ్మలలో ఉత్తమమైన వాటికి టీడీఎఫ్ నిర్వాహకులు బహుమతులు అందించారు. అతిథులుగా సినీనటుడు విజయచందర్, సినీగేయ రచయిత డాక్టర్ వడ్డెపల్లి కృష్ణ పాల్గొన్నారు. బతుకమ్మ పోటీలో దీప్తి, శైలజ విజేతలుగా నిలిచారని టీడీఎఫ్ ప్రతినిధులు మురళి, జమున ఓ ప్రకటనలో తెలిపారు.