మట్టి దిబ్బల కింద 1.9 కోట్ల మనీ! | Bank locker found at Kedarnath, Rs. 1.90 cr recovered | Sakshi
Sakshi News home page

మట్టి దిబ్బల కింద 1.9 కోట్ల మనీ!

Sep 16 2013 12:36 AM | Updated on Sep 1 2017 10:45 PM

మృతదేహాల కోసం వెతుకుతుంటే.. రూ.కోట్ల మనీ దొరికింది.. వరద విలయంలో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయ పరిసరాలు శవాల దిబ్బగా మారడం తెలిసిందే.

డెహ్రాడూన్: మృతదేహాల కోసం వెతుకుతుంటే.. రూ.కోట్ల మనీ దొరికింది.. వరద విలయంలో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయ పరిసరాలు శవాల దిబ్బగా మారడం తెలిసిందే.  మృతదేహాల కోసం మట్టి దిబ్బల కింద గత వారం గాలిస్తుండగా ఆలయ సమీపంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన లాకర్ దొరికింది. వరదల్లో ఆలయం పక్కనున్న ఎస్‌బీఐ ఆఫీసు నుంచి ఇది కొట్టుకుపోయింది.   చివరికి ఇలా దొరికింది.   డెహ్రాడూన్ నుంచి వచ్చిన ఎస్‌బీఐ అధికారులు శనివారం దాన్ని తెరచి అందులో ఉండాల్సిన రూ.1.9 కోట్లు సురక్షితంగా ఉన్నట్లు గుర్తించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement