
టీనేజర్లలో పెరుగుతున్న అబార్షన్లు
వియత్నాంలో ఏడాదికి దాదాపు ఆరు వేల మంది టీనేజి అమ్మాయిలు అబార్షన్లు చేయించుకుంటున్నారు. ఈ విషయాన్ని అక్కడి జనరల్ ఆఫీస్ ఫర్ పాపులేషన్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ తెలిపింది.
వియత్నాంలో ఏడాదికి దాదాపు ఆరు వేల మంది టీనేజి అమ్మాయిలు అబార్షన్లు చేయించుకుంటున్నారు. ఈ విషయాన్ని అక్కడి జనరల్ ఆఫీస్ ఫర్ పాపులేషన్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ తెలిపింది. 2015 సంవత్సరంలో మొత్తం దేశంలో 2.80 లక్షల అబార్షన్లు జరగగా, వాటిలో 2 శాతం టీనేజి అమ్మాయిలేనని ఈ లెక్కల్లో తేలింది. అయితే, ఇవన్నీ కేవలం ప్రభుత్వాస్పత్రులలో జరిగినవి మాత్రమే. దాంతో వాస్తవ లెక్కలు దీనికంటే చాలా ఎక్కువ ఉంటాయని అంటున్నారు.
తమ సంగతి ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో చాలామంది టీనేజర్లు ప్రభుత్వ ఆస్పత్రులను కాదని.. ప్రైవేటు ఆస్పత్రులకే వెళ్తారని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా అబార్షన్లు కొంతవరకు తగ్గుముఖం పడుతున్న మాట వాస్తవమే అయినా.. టీనేజిలోనే గర్భం దాలుస్తున్న అమ్మాయిల సంఖ్య మాత్రం వియత్నాంలో పెరుగుతోందట. ప్రతి వంద మంది టీనేజి అమ్మాయిలలో ముగ్గురు గర్భం దాలుస్తున్నట్లు అంచనా.