ఘోర ప్రమాదం.. 20మంది చిన్నారులు ఆహుతి | 20 Children Killed In South Africa Bus Crash: Emergency Services | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం.. 20మంది చిన్నారులు ఆహుతి

Apr 21 2017 8:44 PM | Updated on Sep 5 2017 9:20 AM

దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

జోహన్నెస్‌ బర్గ్‌:  దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాల విద్యార్థులతో వెళుతున్న  బస్సు శుక్రవారం ప్రమాదానికి గురైంది.  దేశ రాజధాని  ప్రిటోరియాకు 70 కిలోమీటర్ల (45 మైళ్ళు) దూరంలో ఉన్న బ్రోంకోర్సట్స్‌ రూట్‌  వెరేనా పట్టణాల మధ్య రహదారిపై మినీబస్ -ట్రక్కు గుద్దుకోవడంతో 20మంది చిన్నారులు మృతి చెందారు.  ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగడంతో  చిన్నారులు  అగ్నికి ఆహుతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటనలో మరికొంత మంది విద్యార్థులు గాయపడ్డట్టు తెలుస్తోంది. పారామెడికల్ సిబ్బంది, అగ్రిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.  సహాయక చర్యలు   కొనసాతున్నాయని స్తానిక అధికారులు ఒక ప్రకటనలోతెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement