వైఎస్సార్‌సీపీదే ఉజ్వల భవిష్యత్తు | YSRCP's bright Future | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీదే ఉజ్వల భవిష్యత్తు

Aug 31 2015 4:19 AM | Updated on Nov 9 2018 5:52 PM

వైఎస్సార్‌సీపీదే ఉజ్వల భవిష్యత్తు - Sakshi

వైఎస్సార్‌సీపీదే ఉజ్వల భవిష్యత్తు

రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ పోరాడుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్‌కుమార్ స్పష్టం చేశారు...

- గ్రామస్ధాయి నుంచి పార్టీ బలోపేతం
- ప్రజాసమస్యలపై పోరాడుతాం
- వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్
ఉట్నూర్ :
రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ పోరాడుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్‌కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం ఉట్నూర్ మండల కేంద్రంలో నిర్వహిం చిన పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏజెన్సీలో విష జ్వరాలు, వ్యాధులు ప్రబలి గిరిజనులు పదుల సంఖ్యలో మృత్యువాతపడుతున్నా, ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదన్నారు.

పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు కృషి చేయూలన్నారు. వచ్చే నెల 10 వరకు గ్రామ, మండల కమిటీలు ఏర్పాటుచేయూలని సూచించారు. రానున్నా రోజుల్లో పార్టీకి ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందన్నారు. అనంతరం పార్టీ  ఉట్నూర్ మండల అధ్యక్షుడిగా ముజాహిద్, ఖానాపూర్ మండల అధ్యక్షుడిగా కే.జ్ఞానేశ్వర్‌లను నియమిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ రాష్ట్ర సం యుక్త కార్యదర్శి, ఖానాపూర్ ఇన్‌చార్జి తోడసం నా గోరావ్, రాష్ట్ర కార్యదర్శి శంకర్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు తిలక్‌రావ్, జాయింట్ సెక్రెటరీ పురుషోత్తం, ఆదిలాబాద్ పట్టణాధ్యక్షుడు సలావుద్దీన్; ఇంద్రవెల్లి మండల అధ్యక్షుడు ఉత్తమ్, నాయకులు మహేశ్, రమేశ్, మోసిన్, హాకీమ్ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement