వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం వరంగల్ జిల్లా హన్మకొండ బయల్దేరి వెళ్లారు.
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం వరంగల్ జిల్లా హన్మకొండ బయల్దేరి వెళ్లారు. రోడ్డు ప్రమాదంలో గత నెల 23న మరణించిన పార్టీ యువజన విభాగం నేత భీంరెడ్డి సుధీర్‌రెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. సుధీర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆయన హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.