సెల్ టవర్ ఎక్కిన యువకుడు | Young man boarded the cell tower | Sakshi
Sakshi News home page

సెల్ టవర్ ఎక్కిన యువకుడు

Sep 29 2015 4:57 AM | Updated on Aug 21 2018 9:20 PM

సెల్ టవర్ ఎక్కిన యువకుడు - Sakshi

సెల్ టవర్ ఎక్కిన యువకుడు

భద్రాచలం పోలీసు స్టేషన్‌కు ఆనుకొని ఉన్న సెల్‌టవర్‌పైకి ఎక్కి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు...

- పోలీసు స్టేషన్ ఆవరణలోనే ఘటన
భద్రాచలం :
భద్రాచలం పోలీసు స్టేషన్‌కు ఆనుకొని ఉన్న సెల్‌టవర్‌పైకి ఎక్కి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన పట్టణంలో తీవ్ర చర్చనీయూంశమైంది. వివరాలిలా ఉన్నారుు. భద్రాచలం పోలీస్‌స్టేషన్‌కు వెనుక ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌ను గొండెల్లి శ్యాంబాబు అనే వ్యక్తి ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న మీడియూ ప్రతినిధులు అక్కడికి చేరుకుని దిగమ ని అడిగినా దిగలేదు. పోలీసుల నుంచి హామీ వస్తే దిగుతానని చెప్పాడు. అరుునప్పటికీ పోలీసులు రాకపోవడంతో యువకుడు టవర్ దిగిరాగానే ఓ కానిస్టేబుల్ వచ్చి పోలీస్‌స్టేషన్‌కు తరలించాడు. గంటపాటు సెల్‌టవర్ దిగిరాకపోవడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.
 
పోలీసులు వేధింపులు తాళలేక...
పోలీస్‌స్టేషన్‌లో శ్యాంబాబు మాట్లాడుతూ పశ్చిమగోదావరి జీలుగుమిల్లు ప్రాంతానికి చెందిన తాను గతంలో దొంగతనాలు చేసేవాడినని, ప్రస్తుతం చేయడం లేదన్నారు. నాలుగు రోజలు కిందట భద్రాచలం రాగా పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లి వేధించారన్నారు. ఇప్పటికీ ఇంటికి పంపించకపోవడంతో ఇలా చేయూల్సి వచ్చిందని పేర్కొన్నాడు. సెల్‌టవర్‌పై ఉన్నప్పుడు ఎస్సై ఫోన్‌లో మాట్లాడాడని, ఎలాంటి ఇబ్బందులు పెట్టమని హామీ ఇవ్వడంతోనే దిగి వచ్చానని చెప్పాడు.

Advertisement
 
Advertisement
Advertisement