యాదవులంతా ఐక్యంగా ఉండాలి: తలసాని | yadavas always to maintain unity, says minister talasani srinivasa yadav | Sakshi
Sakshi News home page

యాదవులంతా ఐక్యంగా ఉండాలి: తలసాని

Feb 25 2015 3:40 AM | Updated on Sep 2 2017 9:51 PM

యాదవులంతా ఐక్యంగా ఉండాలి: తలసాని

యాదవులంతా ఐక్యంగా ఉండాలి: తలసాని

యాదవులంతా కలసికట్టుగా ఉండాలని, ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.

హైదరాబాద్:  యాదవులంతా కలసికట్టుగా ఉండాలని, ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. నాగోలు శుభం కన్వెన్షన్ హాల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన అఖిల భారత యాదవమహాసభ రాష్ట్ర సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తల సాని మాట్లాడుతూ యాదవుల పండుగైన శ్రీకృష్ణాష్టమి, దసరా, సదర్ మేళాలు, అలై బలై వేడుకలను అన్ని జిల్లాల్లో నిర్వహించాలని సూచించారు. చంద్రబాబు తెలంగాణలోని బీసీలను మోసం చేశారని, సీఎం అభ్యర్థికి కనీసం ఫ్లోర్‌లీడర్ పదవి కూడా ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్సీ, కార్పొరేషన్, మార్కెటింగ్ డెరైక్టర్లు, దేవాలయ కమిటీ, యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్లుగా అవకాశం కల్పించాలని తీర్మానం చేశారు. కార్యక్రమంలో   బి.బాబురావుయాదవ్, అశోక్‌కుమార్‌యాదవ్, ఎమ్మె ల్యే అంజయ్యయాదవ్, లక్ష్మణ్‌యాదవ్, జైపాల్‌యాదవ్, నోముల నర్సింహయ్యయాదవ్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement