ఉబికి వస్తున్న నీళ్ల ఊట | Wubi Coming to the water fountain | Sakshi
Sakshi News home page

ఉబికి వస్తున్న నీళ్ల ఊట

Jun 23 2015 4:19 AM | Updated on Apr 4 2019 2:50 PM

ఉబికి వస్తున్న నీళ్ల ఊట - Sakshi

ఉబికి వస్తున్న నీళ్ల ఊట

వరంగల్ జిల్లా ములుగు మండలంలోని నిమ్మనగర్‌లో చెరువు శిఖం భూమిలో ఊట నీరు ఊబికి వస్తోంది.

* 100 మీటర్లలో 35 ప్రాంతాల్లో..  
* సాంక్రుతండాలో 6 మీటర్ల మేర భారీ గొయ్యి

ములుగు: వరంగల్ జిల్లా ములుగు మండలంలోని నిమ్మనగర్‌లో చెరువు శిఖం భూమిలో ఊట నీరు ఊబికి వస్తోంది. సుమారు 40 గం టలుగా నీరు ఉబికి వస్తుండగా... రోజురోజుకూ ఉధృతి పెరగడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువుతోపాటు శిఖం భూములు వరద నీటితో నిండిపోయాయి.

ఈ శిఖం భూముల్లో సుమారు 30 నుంచి 35 ప్రాంతాల్లో కింది భాగం నుంచి ఊట నీరు బయటకు వస్తోంది.  గతంలో తీసిన కాలువ ప్రాంతంలో సుమారు 100 మీటర్ల మేర ఊట నీరు ఉబికి వస్తోంది. భూ అంతర్భాగంలో ఏర్పడిన గాలి పొరల కారణంగా ఇలా జరుగుతుందని తహసీల్దార్ సత్యనారాయణ తెలిపారు.
 
భారీ గుంతలు...
నిమ్మనగర్ పరిసర  ప్రాంతంలోని సాంక్రు తండా, దన్‌మిట్ట ప్రాంతంలో సుమారు ఆరు మీటర్ల పొడవు వైశాల్యంతో భారీ గుంత ఏర్పడింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సత్యనారాయణ వచ్చి పరిశీలించారు. నల్లబెల్లి మం డలం గోవిందాపూర్ శివారు మూడు చెక్కలపల్లికి చెందిన రైతు భూక్య రమేష్ వ్యవసా యబావిలో సోమవారం హఠాత్తుగా గుంత పడింది. సుమారు ఆరు మీటర్ల వెడల్పు, 15 మీటర్ల లోతు గుంత ఏర్పడింది. ఇదే పంచాయతీ పరిధిలో గతంలోనూ ఇలాంటి గుంతలు పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement