breaking news
mulugu Zone
-
ములుగు ఎన్కౌంటర్.. పౌరహక్కుల సంఘం ఆరోపణలను ఖండించిన డీజీపీ
సాక్షి, హైదరాబాద్: ములుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పౌరహక్కుల సంఘం ఆరోపణలను తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి ఖండించారు. ఎదురుకాల్పుల్లో విష ప్రయోగం చేశారనేది తప్పుడు ప్రచారం అంటూ కొట్టిపారేశారు.ములుగు జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనపై తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ.. ‘ఎదురుకాల్పుల్లో విష ప్రయోగం చేశారనేది దుష్ప్రచారం. పౌరహక్కుల సంఘం ఆరోపణలను ఖండిస్తున్నాను. ఎదురుకాల్పులకు కొద్ది రోజుల ముందు ఇన్ఫార్మర్ అనే నెపంతో ఇద్దరు ఆదివాసీలను దారుణంగా హత్య చేశారు. ఇలాంటి ఘటనలను అడ్డుకొనేందుకు పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు దిగారు.మావోయిస్టులు అత్యాధునిక ఆయుధాలు వినియోగించారు. పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో సాయుధులైన ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. శవపరీక్షలు.. హైకోర్టు, ఎన్హెచ్ఆర్సీ సూచనల మేరకే జరుగుతున్నాయి. విచారణ అధికారిగా ఇతర జిల్లా డిఎస్పీని నియమించాము. దర్యాప్తు కొనసాగుతోంది అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ఆదివారం తెల్లవారుజామున ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఓ మహిళా మావో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నర్సంపేట-ఇల్లందు ఏరియా కమిటీ కార్యదర్శి కుర్సం మంగు అలియాస్ భద్రు, ఏటూరునాగారం-మహాదేవ్‌పూర్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు సైతం ఉన్నారు. మధు స్వస్థలం పెద్దపల్లి జిల్లా రాణాపూర్ కాగా, మిగతా ఆరుగురు ఛత్తీస్‌గఢ్ జిల్లాకు చెందినవారు. ఉదయం 6.16 గంటల ప్రాంతంలో చెల్పాక-ఐలాపూర్ అభయారణ్యంలోని పోలకమ్మవాగు సమీపంలో మావోయిస్టులకు, బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. దాదాపు అరగంటకుపైగా కాల్పులు జరిగినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత సంఘటనా స్థలంలో ఏడుగురి మృతదేహాలను గుర్తించారు. ఘటనాస్థలిలో రెండు ఏకే-47 తుపాకులు, 303 రైఫిల్, ఇన్సాస్ తుపాకీ, ఎస్బీబీఎల్ గన్, సింగిల్‌షాట్ తుపాకీ, తపంచా, కిట్‌బ్యాగులు, విప్లవ సాహిత్యం తదితర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ములుగు మండలం లో ప్రేమజంట ఆత్మహత్య
-
ఉబికి వస్తున్న నీళ్ల ఊట
* 100 మీటర్లలో 35 ప్రాంతాల్లో.. * సాంక్రుతండాలో 6 మీటర్ల మేర భారీ గొయ్యి ములుగు: వరంగల్ జిల్లా ములుగు మండలంలోని నిమ్మనగర్‌లో చెరువు శిఖం భూమిలో ఊట నీరు ఊబికి వస్తోంది. సుమారు 40 గం టలుగా నీరు ఉబికి వస్తుండగా... రోజురోజుకూ ఉధృతి పెరగడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువుతోపాటు శిఖం భూములు వరద నీటితో నిండిపోయాయి. ఈ శిఖం భూముల్లో సుమారు 30 నుంచి 35 ప్రాంతాల్లో కింది భాగం నుంచి ఊట నీరు బయటకు వస్తోంది. గతంలో తీసిన కాలువ ప్రాంతంలో సుమారు 100 మీటర్ల మేర ఊట నీరు ఉబికి వస్తోంది. భూ అంతర్భాగంలో ఏర్పడిన గాలి పొరల కారణంగా ఇలా జరుగుతుందని తహసీల్దార్ సత్యనారాయణ తెలిపారు. భారీ గుంతలు... నిమ్మనగర్ పరిసర ప్రాంతంలోని సాంక్రు తండా, దన్మిట్ట ప్రాంతంలో సుమారు ఆరు మీటర్ల పొడవు వైశాల్యంతో భారీ గుంత ఏర్పడింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సత్యనారాయణ వచ్చి పరిశీలించారు. నల్లబెల్లి మం డలం గోవిందాపూర్ శివారు మూడు చెక్కలపల్లికి చెందిన రైతు భూక్య రమేష్ వ్యవసా యబావిలో సోమవారం హఠాత్తుగా గుంత పడింది. సుమారు ఆరు మీటర్ల వెడల్పు, 15 మీటర్ల లోతు గుంత ఏర్పడింది. ఇదే పంచాయతీ పరిధిలో గతంలోనూ ఇలాంటి గుంతలు పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.