స్వైన్ ఫ్లూ తో మరొకరు మృతి చెందారు.
హైదరాబాద్: స్వైన్ ఫ్లూ తో మరొకరు మృతి చెందారు. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి మండలం జిల్లెలకు చెందిన ఓ మహిళ స్వైన్ ఫ్లూ తో శనివారం మరణించింది. స్వైన్ ఫ్లూ లక్షణాలతో గాంధీ లో చేరిన మహిళకు వైద్యులు పరీక్షలు నిర్వహించి స్వైన్ ఫ్లూ సోకినట్టు నిర్ధారించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.