భర్త ఇంటి ముందు భార్య మౌనదీక్ష | Woman stages dharna infront of husband's house | Sakshi
Sakshi News home page

భర్త ఇంటి ముందు భార్య మౌనదీక్ష

Jun 27 2016 3:13 PM | Updated on Jul 27 2018 2:18 PM

ప్రేమించి పెళ్లి చేసుకొని రెండేళ్ల పాటు కాపురం చేసి.. ఆ తర్వాత తనను, తన కొడుకును నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిన భర్త ఇంటి ముందు భార్య మౌనదీక్షకు దిగింది.

పెనుబల్లి (ఖమ్మం) : ప్రేమించి పెళ్లి చేసుకొని రెండేళ్ల పాటు కాపురం చేసి.. ఆ తర్వాత తనను, తన కొడుకును నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిన భర్త ఇంటి ముందు భార్య మౌనదీక్షకు దిగింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిని బెజ్జం బాలకృష్ణ ఏడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన పోతురాజు ఇందిరా రాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

రెండేళ్లు కాపురం చేసిన అనంతరం ఆమెను కొడుకుతో సహా నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఐదేళ్లుగా తల్లిగారింట్లో ఆశ్రయం పొందుతున్న ఇందిరారాణి సోమవారం తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు మౌన దీక్షకు దిగింది. కాగా.. బాలకృష్ణ రెండో వివాహం చేసుకున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement