నిమజ్జనానికి వచ్చి మహిళ మృతి | woman died in Secunderabad | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి వచ్చి మహిళ మృతి

Sep 9 2014 2:06 AM | Updated on Sep 2 2017 1:04 PM

నిమజ్జనానికి వచ్చి మహిళ మృతి

నిమజ్జనానికి వచ్చి మహిళ మృతి

గణేశ్ నిమజ్జనం కోసం సోమవారం ట్యాంక్‌బండ్‌కు వచ్చిన ఓ మహిళ తిరుగు ప్రయాణంలో ఫిట్స్ వచ్చి అకస్మాత్తుగా మృత్యువాత పడింది.

* దిక్కుతోచని స్థితిలో ఏడాది పాప

సాక్షి, హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం కోసం సోమవారం ట్యాంక్‌బండ్‌కు వచ్చిన ఓ మహిళ తిరుగు ప్రయాణంలో ఫిట్స్ వచ్చి అకస్మాత్తుగా మృత్యువాత పడింది. ఏడాది వయసున్న  తన పాపతో కలిసి ఆ మహిళ వచ్చింది. తిరుగు ప్రయాణంలో ఆమె సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని 31 నెంబర్ బస్టాప్ వద్దకు రాత్రి 10 గంటలకు చేరుకుంది.

అకస్మాత్తుగా ఆమెకు ఫిట్స్ రావడంతో స్థానికులు 108 సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో చనిపోయింది. అయితే ఆమె వివరాలు తెలియరాలేదు. పాపను పోలీసులు చేరదీశారు. ఆమె ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement