మనస్తాపంతో మహిళ ఆత్మహత్య | Woman commits suicide | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

Oct 4 2015 8:19 PM | Updated on Nov 6 2018 7:56 PM

నల్లగొండ జిల్లా హాలియా మండలం రంగుంట్ల గ్రామంలో ఓ మహిళ ఆదివారం ఆత్మహత్య చేసుకుంది.

నల్లగొండ జిల్లా హాలియా మండలం రంగుంట్ల గ్రామంలో ఓ మహిళ ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. డొంకల ముత్యాలమ్మ (55)కు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారందరికీ  వివాహాలు అయ్యాయి. భర్త ఐదేళ్ల క్రితమే మృతి చెందాడు. కాగా, కుటుంబ పోషణ కోసం ముత్యాలమ్మ రూ.3 లక్షల వరకు అప్పులు చేసింది.

ఆదాయం లేకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక మనస్తాపం చెంది ఆదివారం ఇంటి దగ్గరే వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోగా, తీవ్ర గాయాలతో మృతి చెందింది.
 

Advertisement
 
Advertisement
Advertisement