మహిళ దారుణహత్య | Woman brutal murder | Sakshi
Sakshi News home page

మహిళ దారుణహత్య

Jul 3 2015 12:27 AM | Updated on Sep 3 2017 4:45 AM

మహిళ దారుణహత్య

మహిళ దారుణహత్య

ఓ గుర్తుతెలియని మహిళ దారుణహత్యకు గురైంది...

- అత్యాచారం.. ఆపై హత్యచేసి నిప్పంటించిన దుండగులు
- ముదిరెడ్డిపల్లి శివారులో ఘటన
- పరిశీలించిన ఏఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్
బాలానగర్:
ఓ గుర్తుతెలియని మహిళ దారుణహత్యకు గురైంది. అత్యాచారం చేసి హతమార్చి.. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికంగా  సంచలనం రేకెత్తించిన ఈ ఘటన గురువారం ఉదయం మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామశివారులో వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. వ్యవసాయ పొలంలో ఓ మహిళ(30) దారుణహత్యకు గురై పూర్తిగా కాలిపోవడాన్ని స్థానికరైతులు గుర్తించారు. ముఖానికి చీరచుట్టి ఊపిరి సల్పకుండాచేసి దానిపై ముఖాన్ని గుర్తించకుండా ప్లాస్టర్ వేశారు. చనిపోయిన తరువాత మృతదేహంపై పెట్రోల్‌పోసి నిప్పంటించడంతో గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది. ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామసర్పంచ్ నర్సింలు సమాచారం మేరకు ఎస్‌ఐ అశోక్‌కుమార్ సంఘటనస్థలాన్ని పరిశీలించారు.
 
సంఘటన స్థలంలో బస్ టికెట్లు
హత్యాస్థలిలో పంజాగుట్ట నుంచి మెహదీపట్నం, మెహదీపట్నం నుంచి హైదర్‌గూడకు ప్రయాణించినట్లు ఆర్టీసీ బస్‌టికెట్లు లభించాయి. దీంతోపాటు టిఫిన్ బాక్స్, రూ.వంద అక్కడ పడి ఉన్నాయి. ఎక్కడి నుంచో మహిళను ఇక్కడికి తీసుకొచ్చి బలత్కరించారా?, లేక స్థానికసెజ్‌లో పనిచేసే కార్మికురాలై ఉంటుందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎస్‌ఐ అశోక్‌కుమార్ డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంను రప్పించి కొన్ని ఆనవాళ్లను సేకరించారు. ఏఎస్‌పి కల్మేశ్వర్ సంగెనవర్, షాద్‌నగర్ రూరల్ సీఐ గంగాధర్ కూడా సంఘటనస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని షాద్‌నగర్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement