చిన్నారి సహా మహిళను హతమార్చారు | Woman and grand daughter killed while resisting robbery in warangal district | Sakshi
Sakshi News home page

చిన్నారి సహా మహిళను హతమార్చారు

Sep 12 2014 9:17 AM | Updated on Aug 30 2018 5:27 PM

చిన్నారి సహా మహిళను హతమార్చారు - Sakshi

చిన్నారి సహా మహిళను హతమార్చారు

వరంగల్ జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. శుక్రవారం తెల్లవారుజామున రఘునాథ్పల్లిలో మూడిళ్లలో దాడిచేసి అడ్డువచ్చినవారిపై కత్తులతో దాడి చేశారు.

వరంగల్ : వరంగల్ జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. శుక్రవారం తెల్లవారుజామున రఘునాథ్పల్లిలో మూడిళ్లలో దాడిచేసి అడ్డువచ్చినవారిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో హర్షిత నందిని అనే చిన్నారితో పాటు  లక్ష్మి అనే మహిళను దుండగులు హతమార్చారు. పలువురిని గాయపరిచారు.

సుమారు ఏడుగురు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఒకేసారి మూడిళ్లలోకి ప్రవేశించి వారిని బంధించి, అనంతరం దోపిడీకి పాల్పడ్డారు.  నగదుతో పాటు బంగారం కోసం వారిపై దాడి చేశారు. గాయపడిన ఓ బాలుడితో పాటు వృద్ధుడిని జనగామ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం వారిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement