రానున్న 3 రోజులు మోస్తరు వర్షాలు  | Weather Forecast Moderate Rainfall For The Next 3 Days | Sakshi
Sakshi News home page

రానున్న 3 రోజులు మోస్తరు వర్షాలు 

Apr 19 2019 3:13 AM | Updated on Apr 19 2019 8:11 AM

Weather Forecast Moderate Rainfall For The Next 3 Days - Sakshi

మరఠ్వాడా నుంచి కోమోరిన్‌ ప్రాంతం వరకు ఇంటీరియర్‌ కర్ణాటక, ఇంటీరియర్‌ తమిళనాడు మీదుగా 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది.

సాక్షి, హైదరాబాద్‌: రానున్న మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో(గంటకు 40 నుంచి 50 కి.మీ) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మరఠ్వాడా నుంచి కోమోరిన్‌ ప్రాంతం వరకు ఇంటీరియర్‌ కర్ణాటక, ఇంటీరియర్‌ తమిళనాడు మీదుగా 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. హిందూ మహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది.  

Advertisement
 
Advertisement
Advertisement