అమిత్ షా మార్గదర్శకంలో పని చేస్తాం : లక్ష్మణ్ | We work under Amith Sha says Laxman | Sakshi
Sakshi News home page

అమిత్ షా మార్గదర్శకంలో పని చేస్తాం : లక్ష్మణ్

Feb 7 2019 7:47 PM | Updated on Feb 7 2019 7:49 PM

We work under Amith Sha says Laxman - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా మార్గదర్శకంలో పని చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. వెయ్యి మందితో 9న అసెంబ్లీ ఇంఛార్జ్‌లు, కన్వీనర్‌లతో రాష్ట్ర స్థాయి కార్యశాల నిర్వహిస్తామన్నారు. ఈ నెల 10న కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలో ఐటీ అధిపతులు, నిపుణులతో హోటల్ ట్రీడెంట్‌లో సమావేశం కానున్నట్టు తెలిపారు. 

13న మహబూబ్ నగర్‌లో జరిగే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, చేవెళ్ల పార్లమెంట్ క్లస్టర్ సమావేశానికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ హాజరవుతారని చెప్పారు. 14న కరీంనగర్‌లో జరిగే భారత్ కీ మాన్ కీ బాత్ మోదీకీ సాత్ కార్యక్రమంలో రాంమాధవ్ పాల్గొంటారని తెలిపారు. అన్ని రాష్ట్రాల అధ్యక్షులతో అమిత్ షా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో 43ప్రాంతాల నుంచి పాల్గొన్నారు. మేరా పరివార్ భాజపా పరివార్ పేరుతో ఫిబ్రవరి 12నుంచి మార్చి 2వరకు బూత్ స్థాయిలో కార్యకర్తల ఇళ్లపై బీజేపీ జెండా ఎగుర వేస్తామన్నారు. కమలజ్యోతి కార్యక్రమంలో భాగంగా మోదీ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందినవారి ఇళ్లలో జ్యోతి వెలిగిస్తామని చెప్పారు. మార్చి 2న మోదీ సంక్షేమ పథకాలను వివరిస్తూ బీజేపీ విజయ్ సంకల్ప పేరుతో 119అసెంబ్లీ నియోజకవర్గల్లో బైకు ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో పెద్ద సంఖ్యలో పార్లమెంట్ స్థానాలు గెలిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement