
వేములవాడ చైర్మన్ గా కేసీఆర్
వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించనున్నారు.
సాక్షి, హైదరాబాద్: వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఆలయ అభివృద్ధి ఆథారిటీ కమిటీని నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డు ఐఏఎస్ అధికారి ఎం.పురుషోత్తమరెడ్డిని వైస్ చైర్మన్ అండ్ సీఈఓగా నియమించారు.
కరీంనగర్ ఎంపీ, వేములవాడ, సిరిసిల్ల ఎమ్మెల్యేలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యకార్యదర్శి, ఫైనాన్స్ శాఖ ముఖ్యకార్యదర్శి, దేవాదాయ ముఖ్య కార్యదర్శి, టౌన్ ప్లానింగ్ డెరైక్టర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్, కరీంనగర్ ఎస్పీ, కరీంనగర్ వెస్ట్ డీఎఫ్‌ఓతో పాటు మరో ఆరుగురు ప్రత్యేక ఆహ్వానిత సభ్యులుగా ఉంటారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. అథారిటీ నిర్వహణ కోసం తాత్కాలికంగా 14 మంది సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.