వ్యాను బోల్తా : 15 మందికి గాయాలు | van roll, 15 injured in adilabad distirict | Sakshi
Sakshi News home page

వ్యాను బోల్తా : 15 మందికి గాయాలు

Feb 20 2015 5:34 PM | Updated on Sep 2 2017 9:38 PM

ఆదిలాబాద్ జిల్లాలో ఓ వ్యాను బోల్తాపడిన ఘటనలో 9 మంది విద్యార్థులు సహా 15 మందికి గాయాలయ్యాయి.

తిర్యాణి: ఆదిలాబాద్ జిల్లాలో ఓ వ్యాను బోల్తాపడిన ఘటనలో 9 మంది విద్యార్థులు సహా 15 మందికి గాయాలయ్యాయి. జిల్లాలోని తిర్యాణి మండలం, సంగిడి మాదర ఆశ్రమ పాఠశాలకు వెళ్లేందుకు 9 మంది విద్యార్థులు కేరేగూడ గ్రామంలో బొలేరో వ్యాను ఎక్కారు. ఈ వ్యాన్ కేరేగూడ గ్రామం నుంచి కందుల బస్తాలతో అసిఫాబాద్‌కు బయల్దేరగా... విద్యార్థులు ఆ బస్తాలపైకి ఎక్కి కూర్చున్నారు.

శుక్రవారం మధ్యాహ్నం ఈ వ్యాను రాఘవాపూర్ గ్రామం సమీపంలోని ఘాట్ రోడ్డులో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 9 విద్యార్థులతో సహా డ్రైవర్, క్లీనర్లకు గాయాలయ్యాయి.  ఓ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రలను తిర్యాణిలోని ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement