వంశీ, విష్ణుల మధ్య జరిగింది చిన్న కొట్లాటే! | V Hanumantharao respond on vamsichand reddy Vs Vishnuvardhan reddy issue | Sakshi
Sakshi News home page

వంశీ, విష్ణుల మధ్య జరిగింది చిన్న కొట్లాటే!

Dec 13 2014 3:08 PM | Updated on Mar 29 2019 9:24 PM

వంశీ, విష్ణుల మధ్య జరిగింది చిన్న కొట్లాటే! - Sakshi

వంశీ, విష్ణుల మధ్య జరిగింది చిన్న కొట్లాటే!

కాంగ్రెస్ యువ నేతలు వంశీచంద్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిల మధ్య జరిగింది చిన్న కొట్లాట మాత్రమేనని ఆపార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు.

హైదరాబాద్ : కాంగ్రెస్ యువ నేతలు వంశీచంద్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిల మధ్య జరిగింది చిన్న కొట్లాట మాత్రమేనని ఆపార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. ఉద్రేకంలో జరిగిన గొడవను ఇద్దరూ మర్చిపోయి పార్టీ కోసం పనిచేయాలని ఆయన శనివారమిక్కడ సూచించారు.

బీజేపీ వరుసగా హిందుత్వ అంశాలను చేపడతూ ప్రజలను రెచ్చగొడుతోందని వీహెచ్ ఆరోపించారు. ముస్లింలను హిందువులుగా మార్చాలన్నదే ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ అజెండానా? అని ఆయన ప్రశ్నించారు. హిందూ దేశంగా మార్చాలని బీజేపీ ఆలోచిస్తోందని... బీజేపీకి అధికారం ఇచ్చింది అందుకేనా? అంటూ వీహెచ్ మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement