మహిళతో అసభ్య ప్రవర్తన.. ఊబర్‌ డ్రైవర్‌ అరెస్ట్‌ | Uber cab driver arrested in Madhapur | Sakshi
Sakshi News home page

మహిళతో అసభ్య ప్రవర్తన.. ఊబర్‌ డ్రైవర్‌ అరెస్ట్‌

Oct 21 2017 11:38 PM | Updated on Aug 30 2018 9:02 PM

Uber cab driver arrested in Madhapur - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :
కొండాపూర్‌కు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఊబర్‌ క్యాబ్‌ డ్రైవర్‌ను షీటీమ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్లో ప్రేమ్ కుమార్ అనే ఊబర్ క్యాబ్ డ్రైవర్ను సైబరాబాద్  షీటీమ్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ నెల 19వ తేది(గురువారం) ఉదయం మాదాపూర్ నుండి ఢిల్లీకి వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు ఊబర్ క్యాబ్లో ఓ మహిళ బయలు దేరారు. అయితే దారిలో తన పట్ల డ్రైవర్ ప్రేమ్ కుమార్ అసభ్యంగా ప్రవర్తించాడని మహిళా ప్రయాణీకురాలు ఢిల్లీలోని సబ్ధర్ జంగ్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

దీంతో ఢిల్లీ పోలీసులు సైబరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. సైబరాబాద్ కమీషనర్ సందీప్ శాండిల్య ఆదేశాలతో రంగంలోకి దిగిన షీటీమ్స్ బృందాలు డ్రైవర్ ప్రేమ్ కుమార్ను అరెస్టు చేశాయి. నిందితుడిపై ఐపీసీ 354 A, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement