తీవ్ర చలిగాలులతో ఇద్దరి మృతి | two old people died due to cold waves in warangal district | Sakshi
Sakshi News home page

తీవ్ర చలిగాలులతో ఇద్దరి మృతి

Dec 29 2015 10:54 PM | Updated on Sep 3 2017 2:46 PM

నాలుగు రోజులుగా వీస్తున్న తీవ్ర చలిగాలుల ప్రభావంతో వరంగల్ జిల్లాలో మంగళవారం ఇద్దరు వృద్ధులు మృతిచెందారు.

మంగపేట: నాలుగు రోజులుగా వీస్తున్న తీవ్ర చలిగాలుల ప్రభావంతో వరంగల్ జిల్లాలో మంగళవారం ఇద్దరు వృద్ధులు మృతిచెందారు. బచ్చన్నపేట మండలం లక్ష్మాపూర్‌కు చెందిన శివరాత్రి మల్లమ్మ(68), మంగపేట మండలం బోరునర్సాపురం గ్రామానికి చెందిన కోగిల వెంకటమ్మ(80) మృత్యువాత పడ్డారు. గ్రామాల్లో చలిగాలులతో వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు తగిన చర్యలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement