పెళ్లి ఇష్టం లేక ఇద్దరు యువతుల ఆత్మహత్య | two girls who marry or commit suicide | Sakshi
Sakshi News home page

పెళ్లి ఇష్టం లేక ఇద్దరు యువతుల ఆత్మహత్య

Dec 19 2015 1:16 AM | Updated on Nov 6 2018 7:56 PM

పెళ్లి ఇష్టం లేక ఇద్దరు యువతుల ఆత్మహత్య - Sakshi

పెళ్లి ఇష్టం లేక ఇద్దరు యువతుల ఆత్మహత్య

పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక వరంగల్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు డిగ్రీ విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్ప డ్డారు.

అప్పల్‌రావుపేట, మీదికొండ గ్రామాల్లో ఘటనలు
 
నెక్కొండ : పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక వరంగల్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు డిగ్రీ విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్ప డ్డారు. ఎస్సై మిథున్ కథనం ప్రకారం..  నెక్కొండ మండలంలోని అప్పల్‌రావుపేటకు గ్రామానికి చెందిన పాయల వెంకన్న కుమార్తె మౌనిక(18) మండల కేంద్రంలోని శ్రీవికాస్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమెకు గత ఆరు నెలల క్రితం ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. చదువులో ముందుండే ఆమెకు వివాహం ఇష్టం లేక, మరోవైపు తల్లిదండ్రులను బాధ పెట్టలేక మనోవేదనకు గురై గురువారం ఉదయం పత్తి చేనులో కొట్టేందుకని పురుగుల మందు కొనుగోలు చేసింది.

శుక్రవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగింది. అనంతరం తన ఇంటి పక్కనేఉండే పిన్ని వద్దకువెళ్లి తాను చనిపోతున్నానని, పురుగుల మందు తాగానని చెప్పింది. వెంట నే మౌనికను ఆస్పత్రికి తరలించేందుకు బైక్‌పై నర్సం పేటకు తీసుకవెళ్తుండగా మా ర్గమధ్యలో మృతి చెందింది. మౌనిక తండ్రి ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపినట్లు ఎస్సై వివరించారు.

శ్రీవికాస్ కళాశాలకు సెలవు
బీఎస్సీ (ఎంపీసీఎస్) సెకండియర్ చదువుతున్న మౌనిక అకాల మృతిపట్ల కళాశాల విద్యార్థులు మౌనం పాటించి నివాళులర్పించారు. కళాశాలలో టాపర్‌గా నిలిచిన మౌనిక మృతికి సంతాపంగా కళాశాలకు సెలవు ఇవ్వగా, ఆమె స్వగ్రామం అప్పల్‌రావుపేటకు కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు బయల్దేరి వెళ్లి అంత్యక్రియలకు హాజరయ్యారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement