శుభకార్యానికి వెళ్లి వస్తోన్న వాహనం బోల్తా కొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. ఈ సంఘటన నిజామబాద్ జిల్లా జక్రాన్‌పల్లి శివారులో బుధవారం జరిగింది
నిజమాబాద్:శుభకార్యానికి వెళ్లి వస్తోన్న వాహనం బోల్తా కొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. ఈ సంఘటన నిజామబాద్ జిల్లా జక్రాన్‌పల్లి శివారులో బుధవారం జరిగింది.
గన్నారంకు చెందిన మర్రి రవి(35) కుటుంబసభ్యులతో కలిసి ఆర్మూర్ అంకాపల్లిలో జరుగుతున్న ఓ శుభకార్యానికి హాజరై కారులో తిరిగి వస్తుండగా జక్రాన్‌పల్లి సమీపంలో ఓ కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి కారు బోల్తా కొట్టింది. దీంతో వాహనం నడుపుతోన్న రవితో పాటు అతని మేనకొడలు రమ్య అక్కడిక్కడే మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.