సబ్సిడీ గొర్రెలు తరలిస్తున్న ఇద్దరి అరెస్టు | Two arrested for moving subsidized sheep | Sakshi
Sakshi News home page

సబ్సిడీ గొర్రెలు తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

Feb 19 2018 3:34 PM | Updated on Aug 20 2018 4:27 PM

Two arrested for moving subsidized sheep - Sakshi

మంచిర్యాలక్రైం : ప్రభుత్వం యాదవులకు సబ్సిడీపై అందజేసిన గొర్రెలను అధిక ధరలకు విక్రయించేందుకు వ్యానులో తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆదివారం ఆదుపులోకి తీసుకున్నట్లు మంచిర్యాల టాస్క్‌ ఫోర్స్‌  సీఐ సారిలాల్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్సిడీ గొర్రెల విక్రయంపై కొంత కాలంగా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఆదివారం తమకు అందిన సమాచారం మేరకు గొర్రెలను తరలిస్తున్న డీసీఎం వ్యానును పట్టుకుని అందులో ఉన్న63 గొర్రెలను స్వాధీనం  చేసుకున్నామన్నారు. గొర్రెలు తరలిస్తున్న ముఖ్యసూత్రదారులు మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం రాపల్లి గ్రామానికి చెందిన గెల్లు మల్లేశ్, జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలం రాజారాంపల్లెకు చెందిన మేకల ఓదెలును అరెస్టు చేసినట్లు తెలిపారు. చెన్నూర్, మండలం లింగంపల్లి  నుంచి జగిత్యాల జిల్లా  రాజారాంపల్లెకు గొర్రెలను తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పట్టణ ఎస్సై శ్రీనివాస్‌ యాదవ్‌కు, గొర్రెలను పశుసంవర్థక శాఖ జిల్లా అధికారులు, మంచిర్యాల తహసీల్దార్‌ కుమారస్వామిలకు అప్పగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బంది సంపత్, వెంకటేశ్వర్లను రామగుండం సీపీ విక్రమ్‌ జిత్‌ దుగ్గల్‌ అభినందించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement