119 బీసీగురుకులాల ఏర్పాటు  | TS Government Agreed To Form 119 Gurukula Schools | Sakshi
Sakshi News home page

Aug 5 2018 3:03 AM | Updated on Aug 5 2018 4:33 AM

TS Government Agreed To Form 119 Gurukula Schools - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కొత్తగా 119 గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నియోజకవర్గానికి ఒక గురుకులం చొప్పున మంజూరు చేసింది. ఈమేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి.వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2017–18 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 119 గురుకుల పాఠశాలలను నియోజకవర్గానికి ఒకటి చొప్పున మంజూరు చేశారు. ఇందులో సగం బాలికల గురుకులాలు కాగా మిగతా సగం బాలుర గురుకులాలున్నాయి. తాజాగా నియోజకవర్గానికొకటి చొప్పున గురుకుల పాఠశాలను ప్రభుత్వం మంజూరు చేసిన నేపథ్యంలో బాలుర గురుకులం ఉన్నచోట బాలికలు, బాలికల గురుకులం ఉన్న చోట బాలుర గురుకులాన్ని ప్రారంభించనున్నారు. వీటి ఏర్పాటుకు సంబంధించి భవనాలను గుర్తించాలని ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టును ఆదేశించింది. ఈ గురుకులాల్లో ఉద్యోగాలను తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు ద్వారా చేపట్టాలని సూచించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement