breaking news
B.venkatesh
-
119 బీసీగురుకులాల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 119 గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నియోజకవర్గానికి ఒక గురుకులం చొప్పున మంజూరు చేసింది. ఈమేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి.వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2017–18 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 119 గురుకుల పాఠశాలలను నియోజకవర్గానికి ఒకటి చొప్పున మంజూరు చేశారు. ఇందులో సగం బాలికల గురుకులాలు కాగా మిగతా సగం బాలుర గురుకులాలున్నాయి. తాజాగా నియోజకవర్గానికొకటి చొప్పున గురుకుల పాఠశాలను ప్రభుత్వం మంజూరు చేసిన నేపథ్యంలో బాలుర గురుకులం ఉన్నచోట బాలికలు, బాలికల గురుకులం ఉన్న చోట బాలుర గురుకులాన్ని ప్రారంభించనున్నారు. వీటి ఏర్పాటుకు సంబంధించి భవనాలను గుర్తించాలని ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టును ఆదేశించింది. ఈ గురుకులాల్లో ఉద్యోగాలను తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు ద్వారా చేపట్టాలని సూచించింది. -
మద్యం తాగించి హత్య చేశారు
నల్లగొండ : ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేసిన సంఘటన నల్లగొండ జిల్లా ఆలేరు పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. బంద్రు వేంకటేశ్ (24) అనే యువకుడిని కొంత మంది వ్యక్తులు బాగా మందు తాగించి దారుణంగా హత్య చేశారు. ఆ తరువాత మృతదేహన్ని సమీపంలోని రైల్వే ట్రాక్‌పై పడేశారు. ఈ విషయాన్ని స్థానికులు బుధవారం ఉదయం గుర్తించి... రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్గొండ తరలించారు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతుడి తల్లిదండ్రులు ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. దీనిపై మరింత సమాచారం అందవలసి ఉంది.