మద్యం తాగించి హత్య చేశారు | Man murdered in nalgonda district | Sakshi
Sakshi News home page

మద్యం తాగించి హత్య చేశారు

Feb 24 2016 3:39 PM | Updated on Aug 29 2018 4:18 PM

ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి రైల్వే ట్రాక్పై పడేసిన సంఘటన నల్లగొండ జిల్లా ఆలేరు పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది.

నల్లగొండ : ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి రైల్వే ట్రాక్పై పడేసిన సంఘటన నల్లగొండ జిల్లా ఆలేరు పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. బంద్రు వేంకటేశ్ (24) అనే యువకుడిని కొంత మంది వ్యక్తులు బాగా మందు తాగించి దారుణంగా హత్య చేశారు. ఆ తరువాత మృతదేహన్ని సమీపంలోని రైల్వే ట్రాక్‌పై పడేశారు.

ఈ విషయాన్ని స్థానికులు బుధవారం ఉదయం గుర్తించి... రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్గొండ తరలించారు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతుడి తల్లిదండ్రులు ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. దీనిపై మరింత సమాచారం అందవలసి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement