మెదక్‌లో ఈ–చలాన్‌ ప్రారంభం 

Traffic Rules E Challan Start In Medak - Sakshi

మెదక్‌ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రం మెదక్‌లో రోజు రోజుకు ట్రాఫిక్‌ సమస్య తీవ్రమవుతుందని, అందుకే రోడ్డుపై తోపుడు బండ్లు, ఇతర వాహనాలు పెట్టకుండా చేస్తూ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు పట్టణ సీఐ తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం మెదక్‌పట్టణంలోని రాందాస్‌ చౌరస్తా నుంచి జె.ఎన్‌.రోడ్డు, పెద్దబజార్, కూరగాయల మార్కెట్‌ తదితర ప్రాంతాలను పరిశీలించారు.

ఈ ప్రాంతంలోనే అధికంగా ట్రాఫిక్‌ సమస్య నెలకొంటుందని ఆయన తెలిపారు. ఈ విషయమై రోడ్డుపై ఉన్న తోపుడు బండ్లు, ఇతర పుట్‌పాత్‌ వ్యాపారులతో చర్చించారు. రెండు, మూడు రోజుల్లో ఈ–చలాన్‌ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎవరైన రోడ్డుపై తోపుడు బండ్లుగాని, ఇతర వాహనాలు పెడితే జరిమాన విధిస్తామన్నారు. ట్రాఫిక్‌ సమస్య నివారణకోసం ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికై రాందాస్‌ చౌరస్తా నుంచి జె.ఎన్‌.రోడ్డు వరకు వన్‌వేగా ఏర్పాటు చేసి అక్కడి నుంచి చమన్‌ మీదుగా రాందాస్‌చౌరస్తాకు కలుపనున్నట్లు తెలిపారు. ఈ విషయంపై రెండు, మూడు రోజుల్లో పూర్తి ప్రణాళిక విడుదల చేసి ట్రాఫిక్‌ సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య తదితరులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top