'పార్టీ బలోపేతమే లక్ష్యం' | to strenghthen the party bis my target, says uttam kumar reddy | Sakshi
Sakshi News home page

'పార్టీ బలోపేతమే లక్ష్యం'

Mar 4 2015 3:26 AM | Updated on Sep 19 2019 8:44 PM

'పార్టీ బలోపేతమే లక్ష్యం' - Sakshi

'పార్టీ బలోపేతమే లక్ష్యం'

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థా యి వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేం దుకు కృషి చేస్తానని టీపీసీసీ నూతన అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.

సాక్షి, న్యూఢిల్లీ: గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థా యి వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేం దుకు కృషి చేస్తానని టీపీసీసీ నూతన అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. తన నియామకంపై పార్టీ సీనియర్లలో ఎలాంటి అసంతృప్తి లేదని, ఇప్పటికే అందరితో మాట్లాడానని చెప్పారు. ఈ నెల 6న లేదా 7న పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ పేరు ను అధిష్ఠానం ప్రకటించిన తర్వాత ఆయ న మంగళవారం తొలిసారి ఢిల్లీకి వచ్చారు.

తన భార్య, కోదాడ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌ను వారి నివాసాల్లో కలిశారు. సోనియాతో అరగంట భేటీ తర్వాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. త్వరలో తెలంగాణ నుంచి ఏఐసీసీలో కొందరికి చోటు దక్కే అవకాశమున్నట్లు తనకు సమాచారమున్నట్లు పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో అధికార టీఆర్‌ఎస్‌ను అన్ని విషయాల్లో ఎండగడతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement