కరీంనగర్ జిల్లాలోని పలు ఆలయాలలో చోరీలకు పాల్పడిన దొంగల ముఠాను కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని పలు ఆలయాలలో చోరీలకు పాల్పడిన దొంగల ముఠాను కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు ఆరు లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 1.09 కిలోల వెండి ఆభరణాలు, 20 గ్రాముల బంగారు ఆభరణలతో పాటు 10 ద్విచక్రవాహనాలు ఉన్నాయి.
కాగా ఈ చోరీలకు పాల్పడింది మెట్‌పల్లి మండలం ఇందిరానగర్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన భార్యా, భర్త, మరిది అని పోలీసులు తెలిపారు. వీరి మీద జిల్లా వ్యాప్తంగా మొత్తం 21 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.