టేక్మాల్‌ మార్కెట్‌లో దొంగల హల్‌చల్‌

Thiefs In Tekmal Market At Sangareddy - Sakshi

వారానికి మూడు చొప్పున సెల్‌ఫోన్‌ల అపహరణ 

వస్తువులు, నగదుపై కన్ను..

పోలీసులకు అంతుచిక్కని చోరీలు

సాక్షి, టేక్మాల్‌(మెదక్‌): టేక్మాల్‌ మార్కెట్‌లో దొంగల బెడద అధికమైంది. కాస్త ఆదమరిస్తే చాలా వస్తువులు మాయమవుతున్నాయి. ప్రతీ శనివారం నిర్వహించే వారంతపు సంతకు ఉమ్మడి మెదక్‌ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వస్తారు. ఇక్కడ దొరకని వస్తువంటూ లేదు. దీంతో ప్రతీవారం సంత కిక్కిరిసిపోతుంది. ఇదే అదును చేసుకుంటున్న తొంగలు రెచ్చిపోతున్నారు. అందికాడికి ఎదిదొరికితే అది ఎత్తుకుపోతున్నారు. పోలీసులకు సవాలుగా మారినా దొంగలు దొరకడంలేదు.

అధికంగా సెల్‌ఫోన్‌ల చోరీ.. 
మార్కెట్‌లో కూరగాయాలకు వెళ్లే సామాన్య ప్రజల నగదను అపహరించుకుపోతున్నారు. కాస్త ఆదమరిచి వస్తువులు పెట్టినా మట్టుకున్నా మాయం చేస్తున్నారు. అంతేకాకుండా మార్కెట్‌ వచ్చే వారి సెల్‌ఫోన్‌లో అపహరణ అధికమైంది. ఇటీవట టేక్మాల్‌కు చెందినా గర్శ శ్రీనివాస్, జంగంనాగరాజు, విశ్వనాథం, వీరన్న, శంకర్, రాజు, మాదవచారిలతో పాటూ పల్వంచ గ్రామానికి చెందిన పెద్దగొల్ల రాంకిష్టయ్య, బోయిని నారాయణ, సాయిరెడ్డి, నర్సిరెడ్డి ఫోన్‌లు అపహరణకు గురయ్యాయి. అవుసలి రమేశ్‌ నగదు పోయాయని వాపోతున్నారు. ఇలా వారానికి రెండు నుంచి సెల్‌ఫోన్‌లు అపహరణకు గురవుతున్నాయి. మార్కెట్‌కు కాస్త అజాగ్రత్త వహించినా వస్తువులు అపహరణకు గురువుతున్నాయని వాపోతున్నారు. కొందరు మార్కెట్‌కు వెళ్లాలంటేనే జంకుతున్నారు.

స్టేషన్‌లో ఫిర్యాదులు.. 
వారంతపు సంతలో నగదు పోయిందని, సెల్‌ ఫోన్‌లు పోయాయని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులు పెరుగుతున్నా.. దొంగలు మాత్రం వారి ఆగడాలను ఆపడంలేదు. పోలీసులు సైతం వారంతపు సంతలో నజర్‌పెట్టి అనుమానితులను ప్రశ్నించినా ఫలితం లేకపోతుంది.   దొంగల ఆచూకి పోలీసులకు అంతుచిక్కకపోవడం లేదు. నిఘాను పెంచుతూ అనుమానితులను ప్రశ్నిస్తున్నా ఫలితం లేకపోయింది. మార్కెట్‌లోని దొంగలతో పోలీసులకు సవాల్‌గా మారింది.

పోలీసులకు ఫిర్యాదు చేశా.. 
గత వారం మార్కెట్‌లోకి  కూరగాయాలు తీసుకోవడానికి వెళ్లాను. పదిహేను వేల రూపాయలగల విలువైన పోన్‌ అపహరణ గురయింది. ఎంత వెతికినా దొరకలేదు. దొంగల బెడద అధికమయింది. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. మార్కెట్‌లోని దొంగలను పట్టుకోవాలి. – గర్శ శ్రీనివాస్, టేక్మాల్‌ 

పట్టుకుంటాం.. 
పిర్యాదులు వచ్చిన మాట నిజమే. మార్కెట్‌ రోజు గస్తీలో సిబ్బందిని పెడతాం. రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ పెంచుతాం. మార్కెట్‌కు వెళ్లెవారు కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది. ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలి. అనుమానితులు కంటపడితే సమచారం ఇవ్వండి. దొంగలపై శాఖాపరమైన చర్యలు తప్పవు. 
– షాబొద్దీన్, ఎస్‌ఐ, టేక్మాల్‌  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top