చోరీకి పాల్పడింది రెండు ముఠాలా? | Thefted two gangs in Andhra Bank | Sakshi
Sakshi News home page

చోరీకి పాల్పడింది రెండు ముఠాలా?

Feb 21 2016 1:35 AM | Updated on Aug 25 2018 6:09 PM

మండల కేంద్రంలోని ఆంధ్రాబ్యాంకులో చోరీకి పాల్పడింది రెండు ముఠాలని తెలుస్తోంది. బ్యాంకులో చోరీ విషయం సోమవారం ఉదయం వెలుగు చూసిన...

పోలీసుల అదుపులో ఓ ముఠా
ఘట్‌కేసర్: మండల కేంద్రంలోని ఆంధ్రాబ్యాంకులో చోరీకి పాల్పడింది రెండు ముఠాలని తెలుస్తోంది. బ్యాంకులో చోరీ  విషయం సోమవారం ఉదయం వెలుగు చూసిన విషయం తెలిసిందే. రెండు ముఠాలు చోరీకి పాల్పడినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మొదటి ముఠా బ్యాంకులో వెంటిలేటర్లు పగులగొట్టడం, కట్టర్ల సహాయంతో లాకర్‌గదికి బయటివైపు ఉన్నగ్రిల్ ్సకు ఉన్న తాళం పగులగొట్టడం, తర్వాత లోపలికి వెళ్లి లాకర్‌ను పైనుంచి కోసి సొత్తును వెంటిలేటర్ ద్వారా తీసుకొచ్చి మరో ముఠాకు అప్పగించినట్లు తెలుస్తోంది.

సొత్తును సురక్షిత ప్రాంతానికి తరలించడం వంటి పనులు రెండో ముఠా చేసిందని అధికారులు భావిస్తున్నారు. అయితే, పోలీసులకు దొరికిన ముఠా వద్ద సొత్తు లేకపోవడంతో రెండో మూఠా కోసం గాలిస్తున్నారు. గ్రానైట్ కటింగ్ కోసం వాడే కట్టర్‌ను దొంగలు ఉపయోగించారు. రాజస్థాన్‌కు చెందిన ముఠా అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  
 
తరుగును తీసేసి పరిహారం అందజేస్తున్న బ్యాంకు 82 మంది కస్టమర్లు తాకట్టుపెట్టిన 4.6 కిలోల బంగారానికి అధికారులు తరుగుగా 600 గ్రాములు తగ్గించారు. మిగితా సొమ్మును ఖాతాదారులకు మార్కెట్ రేటు ప్రకారంగా అందచేస్తున్నారు. పరిహారం సరిగా సరిపోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆంధ్రాబ్యాంకు చోరీ ఘటన నేపథ్యంలో ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైల క్యాబిన్‌లు ఖాళీగా కనిపిస్తున్నాయి. అధికారులు ద ర్యాప్తులో బిజీగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement