ప్రాణం తీసిన కలహాలు | the man suicide due to family issues | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన కలహాలు

Mar 20 2017 6:25 PM | Updated on Oct 16 2018 3:12 PM

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

శివ్వంపేట: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్‌ వీరయ్య, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దొంతి గ్రామానికి చెందిన మామిళ్ళ నర్సింలు(26) సోమవారం తెల్లవారుజామున  గ్రామ శివారులోని ఓ కుంటవద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తించిన సమీప రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. నర్సింలుకు గత ఏడాది డిసెంబర్‌లో మూగ యువతితో వివాహం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపం చెందిన నర్సింహులు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్‌ ప్రభుత్వాసుపత్రికి  తరలించారు.  
 
 

Advertisement
 
Advertisement
Advertisement