జయశంకర్‌కు ఘననివాళి | the death anniversary of Jaya Shankar | Sakshi
Sakshi News home page

జయశంకర్‌కు ఘననివాళి

Jun 22 2014 12:25 AM | Updated on Sep 2 2017 9:10 AM

జయశంకర్‌కు ఘననివాళి

జయశంకర్‌కు ఘననివాళి

పట్టణంలో శనివారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ మూడో వర్ధంతి ఘనంగా నిర్వహించారు.

ఆదిలాబాద్ అగ్రికల్చర్ : పట్టణంలో శనివారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ మూడో వర్ధంతి ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొని యాడారు. ఎస్టీయూ ఆధ్వర్యంలో పట్టణంలోని సంఘ భవనంలో జయశంకర్ వర్ధంతి నిర్వహించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రవీంద్ర మాట్లాడుతూ జయశంకర్ ఆశయాలను కొనసాగిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర మరువలేనిదని, తెలంగాణ జాతిపితగా ఆయన కీర్తి అందుకున్నారని పేర్కొన్నారు. సంఘం నాయకులు నరేందర్, విలాస్, యాదగిరి, మనోజ్, రాజు, భూపతి, సుజీత్, నారాయణ, రమేశ్ పాల్గొన్నారు.
 
టీయూటీఎఫ్ ఆధ్వర్యంలో..
టీయూటీఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలోని సంఘ భవనంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి నిర్వహించారు.  ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లచ్చిరాం మాట్లాడుతూ రాష్ట్రంలో అందరూ సుఖసంతోషాలతో ఉన్నప్పుడే జయశంకర్‌కు నిజమైన నివాళి అర్పించినట్లు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు నారాయణరెడ్డి, కార్యదర్శి రాంరెడ్డి, వివిధ మండలాల నాయకులు రామకృష్ణ, వినోద్‌రెడ్డి, భీంరావు, కిషన్, నానాజీ, గిరిధర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement