లాడ్జిలో వ్యక్తి దారుణ హత్య | The brutal murder of a man in lodge | Sakshi
Sakshi News home page

లాడ్జిలో వ్యక్తి దారుణ హత్య

Nov 14 2015 4:45 PM | Updated on Sep 3 2017 12:29 PM

కరీంనగర్ జిల్లా వేములవాడలోని ఓ వ్యక్తి దారుణ హ్యతకు గురయ్యాడు.

కరీంనగర్ జిల్లా వేములవాడలోని ఓ వ్యక్తి దారుణ హ్యతకు గురయ్యాడు. జాత్రా గ్రౌండ్‌లోని లాడ్జి గదిలో వ్యక్తి (40) మృతదేహాన్ని శనివారం మధ్యాహ్నం గుర్తించారు. మృతుడి తలపై బలమైన గాయాలతోపాటు కారంపొడి జల్లి ఉండడంతో హత్య జరిగినట్టు భావిస్తున్నారు. మృతుడు సిద్ధిపేట ప్రాంతానికి చెందిన రవిగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement