భద్రాచలం: ప్రజా సేవకే అంకితమవుతా..!

Tellam Venkat Rao Campaign In Bhadrachalam - Sakshi

సాక్షి, భద్రాచలం: నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజల శ్రేయస్సుకోసం కృషి చేస్తానని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ తెల్లం వెంకట్రావు అన్నారు. బుధవారం భద్రాచలం పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోలో ముఖ్య అతిధిగా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరుకాగా, ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేను ఎప్పుడూ ప్రజల మనిషినేనని తెలిపారు. నాలుగున్నరేళ్ల పాలనలో ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని టీఆర్‌ఎస్‌ చేసి చూపిందని అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో కేసీఆర్‌ మెనిఫెస్టోను త్వరలోనే ప్రజల ముందుకు ఉంచబోతున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని, నిరుపేదలకు కూతుళ్ల పెళ్లిళ్లకోసం కల్యాణలక్ష్మీ, రైతుభందు మరెన్నో పథకాలను తీసుకొచ్చిన ఘనత ఒక్క టీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు. ఇదే రీతిలో భద్రాచల అభివృద్ధికి కూడా తాను కట్టుబడి ఉంటానన్నారు. మీ అమూల్యమైన ఓటును టీఆర్‌ఎస్‌ గుర్తు కారుపై వేసి తనను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నియోజక వర్గ ఇంఛార్జ్‌ మానె రామకృష్ణ, మండల అధ్యక్షుడు యశోధ నగేష్, ప్రధాన కార్యదర్శి చి    ంతాడి చిట్టిబాబు, ఉపాధ్యక్షుడు రత్నం రమాకాంత్, పడిశిరి శ్రీనివాస్, అధికార ప్రతినిథి అరికెళ్ల తిరుపతిరావు, సీనియర్‌ నాయకుడు కోటగిరి ప్రబోద్‌ కుమార్, తాళ్ల రవికుమార్, కొండిశెట్టి కృష్ణ, పెద్దినేని శ్రీనివాస్, మాజీ సర్పంచ్‌ భూక్యా శ్వేత, ఎంపీపీ ఊకే శాంతమ్మ, ఎంపీటీసీలు మానె కమల, బానోత్‌ రాముడు, మహిళా అ«ధ్యక్షురాలు ఎండీ ముంతాజ్, గ్రంథాలయ ఛైర్మన్‌ మామిడి పుల్లారావు,   కృష్ణ, ఎండీ బషీర్, ఈర్ల భారతి, సీతామహలక్ష్మీ, లలిత, గంగా భారతి, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top