తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఇటీవల ప్రవేశపెట్టిన తెలంగాణ తొలి బడ్జెట్ ముమ్మాటికీ కేసీఆర్ ఫ్యామిలీ బడ్జెట్ అని విమర్శించారు.
శుక్రవారం తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం లక్ష కోట్ల బడ్జెట్ అంటూ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పారు.