దేశంలో తెలంగాణ నంబర్‌వన్‌   

Telangana Number One In The Country - Sakshi

పరిపాలన సౌలభ్యం  కోసమే పంచాయతీలు

‘ఆగస్టు’ పథకాలతో  అద్భుత ఫలితాలు

జిల్లా పరిషత్‌ చైర్మన్‌   దఫేదార్‌ రాజు

నిజాంసాగర్‌(జుక్కల్‌) : సీఎం కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దఫేదార్‌ రాజు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి అ హర్నిషలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నిజాంసాగర్‌ మండలం మహమ్మద్‌నగర్, గున్కుల్, తె ల్గాపూర్, గిర్నితండా, దూప్‌సింగ్‌ తండాల్లో గురు వారం పంచాయతీ భవనాలను ఆయన ప్రారం భించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమా వేశాల్లో ఆయన మాట్లాడారు. పరిపాలన సౌల భ్యం కోసం ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను ఏర్పా టు చేశారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు చేర్చడం లక్ష్యంగా పంచాయతీలను బలోపేతం చేస్తున్నారన్నారు. గున్కుల్‌లో మొక్కలు నాటారు. 

సుపరిపాలన

 ఆగస్టు మాసంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజలకు అద్భుతాలు చేకూరుస్తున్నాయని దఫేదార్‌ రాజు అన్నారు. కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయడంతో గ్రామాలు, గిరిజన తండాల్లో సుపరిపాలన సాధ్యమైందన్నారు. అలాగే కంటి సమస్యతో బాధపడుతున్న వృద్ధు లు, మహిళలకు వెలుగునివ్వాలన ఉద్దేశ్యంతో ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెడుతుందన్నారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు ప్రమాదవశాత్తు, సాధారణ మరణం పొందిన బాధిత కుటుంబానికి మేలు చేకూరేలా ఆగస్టు 15 నుంచి రైతు బీమా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

సమావేశంలో సింగితం ఎంపీటీసీ సభ్యురాలు కలకొండ శైలజ, ఎంపీడీవో రాములునాయక్, టీఆర్‌ఎస్‌ నాయకులు వినయ్‌కుమార్, గడ్డం గంగారెడ్డి, వాజిద్‌అలీ, అహ్మద్‌హుస్సేన్, బేగరి రాజు, లింగాల రాంచందర్, కలకొండ నారాయణ, సాయాగౌడ్, చందర్‌గౌడ్, బల్‌రాం, చెందర్, దఫేదార్‌ విజయ్, కాశయ్య, మహేందర్, రాజన్న యువసేన సభ్యులు సంపత్, గోవీర్, ప్రవీణ్, శ్యాం, వికాస్‌గౌడ్,  బొర్ర నరేశ్, స్వామిగౌడ్‌ పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top