యాదాద్రిలో ఒక్కటైన తెలుగబ్బాయి.. తెల్లమ్మాయి | Telangana Man Wedding With Foreign Women | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ అబ్బాయి.. ఆస్ట్రేలియా అమ్మాయి

Jun 26 2018 7:43 PM | Updated on Sep 7 2018 4:33 PM

Telangana Man Wedding With Foreign Women - Sakshi

సాక్షి, యాదాద్రి(ఆలేరు) :  హైదరాబాద్‌ అబ్బాయి.. ఆస్ట్రేలియా అమ్మాయి యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి సాక్షిగా సోమవారం ఒక్కటయ్యారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన దుశ్యంత్‌ అనే యువకుడు ఆరేళ్ల క్రితం ఉద్యోగ నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తుండగా స్థానికంగా ఉంటు న్న రీమా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ విషయం ఇద్దరి కుటుంబీకులకు తెలియడంతో తొలుత విముఖత చూపినా తర్వాత ఒప్పుకున్నారు. ఇద్దరి కుటుంబ సభ్యులు   గు ట్టలో పెళ్లి జరిపించారు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహతంతు అనంతరం ఆస్ట్రేలియా సంప్రదాయం ప్రకారం ఉంగరాలు మార్చుకున్నారు. మనసులు కలవడానికి ఖండాంతరాలు అడ్డుకావని ఈ జంట నిరూపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement