
టీడీపీ మునిగిపోయే పార్టీ
‘టీడీపీ మునిగిపోయే పార్టీ. ఆ పార్టీని పట్టుకుని బీజేపీ పాకులాడుతోంది.’ అని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి
మంత్రి మహేందర్‌రెడ్డి
హన్మకొండ: ‘టీడీపీ మునిగిపోయే పార్టీ. ఆ పార్టీని పట్టుకుని బీజేపీ పాకులాడుతోంది.’ అని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం వరంగల్ జిల్లా హన్మకొండలోని సర్క్యూట్ హౌస్, ఆర్టీసీ వరంగల్-1 డిపోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమం, సమ్మె సందర్భంగా ఆర్టీసీ కార్మికులపై పెట్టిన కేసులు ఎత్తి వేస్తున్నామని ప్రకటించారు. వరంగల్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ పాదయాత్ర చేస్తోందని విమర్శించారు. ఏం చేసినా టీడీపీ, బీజేపీలు ఎన్నికల్లో గెలవబోవన్నారు.