ఇంత దౌర్భాగ్య పాలన ఊహించలేదు: జీవన్‌రెడ్డి

Such a wretched regime did not anticipate Says jeevan reddy - Sakshi

జగిత్యాల: ‘రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ అందరికీ ఆదర్శంగా ఉంటుందని అనుకున్నాం. అయితే ఇంత దౌర్భాగ్య పాలన ఉంటుందని ఊహించలేదు. శాసనసభలో ప్రశ్నించే గొంతు లేకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తోంది’ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన జగిత్యాలలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కోసం కాంగ్రెస్‌ పార్టీ టీఆర్‌ఎస్‌తో కలసి ఎన్నికల్లో పోటీ చేసిందని, కానీ వారు ఎమ్మెల్యేలను బెదిరించి తమ పార్టీ లో చేర్చుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం నియంతృత్వ పోకడకు పోతోందని ఆరోపించా రు. ప్రశ్నించే వారు లేకుంటే చట్ట సభలు ఎందు కన్నారు. స్పీకర్‌కు సైతం స్వతంత్రం లేకుండా పోయిందన్నారు. ఎంఐఎం పార్టీ ప్రతిపక్ష హోదా అడగడం విడ్డూరంగా ఉందన్నార

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top