ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ధర్నా | students dharna for fee reimbursement | Sakshi
Sakshi News home page

ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ధర్నా

Jan 29 2015 4:12 PM | Updated on Oct 1 2018 5:40 PM

ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ధర్నా - Sakshi

ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ధర్నా

మహబూబ్‌నగర్ మండల కేంద్రంలో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం ఫీజురీయింబర్స్‌మెంట్ కోసం ధర్నాకు దిగారు.

అచ్చంపేట(మహబూబ్‌నగర్): మండల కేంద్రంలో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా  తమకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు  డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడం వల్ల ప్రైవేటు కాలేజి యాజమాన్యాలు పరీక్షల సమయంలో హాల్ టికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వనందుకు నిరసనగా అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement