‘డైట్’ఎటు? | students confusion on d.ed counseling delay | Sakshi
Sakshi News home page

‘డైట్’ఎటు?

Nov 18 2014 3:06 AM | Updated on Sep 2 2017 4:38 PM

డీఎడ్ కౌన్సెలింగ్‌లో జాప్యం డైట్‌సెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు శాపంగా మారింది.

 ఖమ్మం: డీఎడ్ కౌన్సెలింగ్‌లో జాప్యం డైట్‌సెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు శాపంగా మారింది. డైట్‌సెట్‌లో మంచి ర్యాంక్ సాధించాం కదా..! అనే ధీమా కౌన్సెలింగ్‌లో జాప్యంతో సన్నగిల్లుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో వివిధ సెట్‌ల కౌన్సెలింగ్ ఆలస్యం కావచ్చని విద్యార్థులు భావించారు. కానీ ఏ ఒక్కరూ డీఎడ్ కౌన్సెలింగ్ లేటవుతుందనుకోలేదు.

అనూహ్యరీతిలో డీఎడ్ కౌన్సెలింగే ఆలస్యమవుతుండటంతో రెండేళ్ల కోర్సును మూడేళ్లు చదవాల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు డిగ్రీ పరీక్ష ఫీజు నోటిఫికేషన్ కూడా వెలవడటంతో ఒరిజనల్ సర్టిఫికెట్‌లు ఇవ్వాలని ఆయా కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయి. అటు డిగ్రీకి వెళ్లలేక, ఇటు డీఎడ్ కౌన్సెలింగ్ కాక టీటీసీ అర్హులు సతమతమవుతున్నారు.

 ఇంటర్మీడియెట్ పరీక్షలు అయ్యాక కొందరు విద్యార్థు లు డైట్‌సెట్‌కు ప్రిపేరయ్యారు. ఇంటర్, డైట్‌సెట్ ఫలితాలు వచ్చాయి. జూన్ 16 జరిగిన డైట్‌సెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 3.46 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో 2.19 లక్షల మం ది డీఎడ్‌కు అర్హత సాధించారు. జిల్లా నుంచి 18,040 మంది హాజరుకాగా పదివేల మందికి పైగా అర్హత సాధించినట్లు సమాచారం. డీఎడ్ కౌన్సెలింగ్ ఆలస్యమవుతుండటంతో ఇప్పుడీ పదివేల మంది పరిస్థితి సందిగ్ధంగా మారింది. ఓ వైపు డిగ్రీ పరీక్ష ఫీజు గడువుతేదీ ముగింపు దశకు వస్తోంది. మరోవైపు డైట్ కళాశాలల్లో చేరేందుకు కౌన్సెలింగ్ నిర్వహించడం లేదు.

డిగ్రీ కళాశాలల్లో సర్టిఫికెట్లు ఇస్తేనే పరీక్ష ఫీజు చెల్లించుకుంటారు. తీరా డీఎడ్ కౌన్సెలింగ్ సమయాని కి చేతిలో సర్టిఫికెట్లు ఉండవు. ఇవ్వకుండా డీఎడ్ కౌన్సెలింగ్ కోసం ఎదురుచూద్దామంటే అది ఎప్పుడు నిర్వహిస్తారో తెలియడం లేదని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. ప్రభుత్వం, కన్వీనర్ కో టా ఇలా ఏ లెక్కన చూసినా 20వేల ర్యాంకులోపు వారికి మా త్రం ఎటువంటి ఢోకా లేకుండా ఫ్రీ సీటు దొరకవచ్చని విద్యార్థులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రైవేట్ డైట్ కళాశాలలకు అఫిలియేషన్ గండం కూడా పొంచివుండటంతో ఏ కాలేజీకి అనుమతి వస్తుందో..దేనికి రాదో? తెలియని పరిస్థితి నెలకొంది. 19వ తేదీ డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపునకు తుది గడువు కావడంతో డైట్‌సెట్‌లో అర్హత సాధించి న విద్యార్థులు ఎటూ తే ల్చుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement