ఎంసెట్‌లో ర్యాంకు.. ఇంటర్‌లో ఫెయిల్‌ 

Student Got Rank In EAMCET But Failed In Inter - Sakshi

17,445 మంది విద్యార్థులకు కష్టకాలం

మరో 4,281 మంది విద్యార్థులకు ఇంటర్‌ మార్కుల్లేక కేటాయించని ర్యాంకులు

ఫెయిలైనవారిలో అగ్రికల్చర్‌ పరీక్షల్లో అర్హులే ఎక్కువ 

సాక్షి, హైదరాబాద్‌: ఇదో విచిత్ర పరిస్థితి. ఎంసెట్‌లో ర్యాంకు వచ్చినా ఇంటర్మీడియట్‌లో ఫెయిలైన విద్యార్థులు వేలసంఖ్యలో ఉన్నారు. దీంతో వారంతా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ మొదటిదశ కౌన్సెలింగ్‌లో ప్రవేశాలు పొందలేని పరిస్థితి నెలకొంది. తెలంగాణ ఎం సెట్‌లో ఇంజనీరింగ్‌ పరీక్షకు మొత్తం 1,31,209 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 1,08,213 మంది అర్హత సాధించారు. కానీ, వీరిలోనూ 91,446 మంది విద్యార్థులకు మాత్రమే ఎంసెట్‌ కమిటీ ర్యాంకులను కేటాయించింది. మిగతా 13,251 మంది విద్యా ర్థులు ఇంటర్‌లో ఫెయిలయ్యారు. దీంతో వారి కి ఎంసెట్‌ కమిటీ ర్యాంకులను కేటాయించలేదు. మరో 3,491 మంది విద్యార్థులకు సం బంధించిన ఇంటర్‌ మార్కుల వివరాలు లేకపోవడంతో ర్యాంకులను కేటాయించలేదని ఎం సెట్‌ కమిటీ వెల్లడించింది.

అగ్రికల్చర్‌ విభా గంలో 68,550 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా అందులో 63,758 మంది అర్హత సాధించారు. అయితే, అందులో 57,774 మం దికే ఎంసెట్‌ కమిటీ ర్యాంకులను కేటాయించింది. మిగతా విద్యార్థుల్లో 4,194 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో ఫెయిల్‌ కావడంతో వారికి ర్యాంకులను కేటాయించలేదు. మరో 1,790 మంది విద్యార్థుల ఇంటర్‌ మార్కుల వివరాలు లేకపోవడంతో వారికి ర్యాంకులను కేటాయించలేదని ఎంసెట్‌ కమిటీ వివరించింది. ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులంతా అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలు రాస్తున్నారు. వారి లో ఉత్తీర్ణులైన వారికి ప్రస్తుతం కేటాయించిన ర్యాంకులు ఉండవు. అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షల్లో వచ్చే మార్కుల ఆధారంగా తదుపరి ర్యాంకులను కేటాయించనున్నారు. 


Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top